Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్‌ చేసిన పీఎం..

Modi Meloni

Modi Meloni

Modi-Meloni: ఇటలీ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది.. మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోడీతో కలిసి దిగిన ఓ కొత్త సెల్ఫీని పంచుకుంటూ “రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. ఆ తర్వాత మెలోనితో కలిసి దిగన నాలుగు ఫొటోలను షేర్‌ చేస్తూ ట్వీట్ చేశారు.. “రోమ్‌కు చేరుకున్న అనంతరం ప్రధాని మెలోనితో డిన్నర్ సందర్భంగా సమావేశమయ్యే అవకాశం లభించింది. అనంతరం చారిత్రాత్మక కొలస్సియంను సందర్శించాం. పలు కీలక అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. భారత్-ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నేటి చర్చల కోసం ఎదురుచూస్తున్నాను.” అంటూ తన ఎక్స్‌ ఖాతా (ట్విట్టర్‌)లో రాసుకొచ్చారు ప్రధాని మోడీ..

ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోమ్ చేరుకున్న అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాత్రి విందు సందర్భంగా ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం అయిన Colosseumను కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “రోమ్ చేరుకున్న తర్వాత ప్రధాని మెలోనితో డిన్నర్ సమావేశం జరిగింది. అనంతరం చారిత్రక కొలస్సియంను సందర్శించే అవకాశం లభించింది. పలు అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. భారత్-ఇటలీ స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై నేటి చర్చల కోసం ఎదురుచూస్తున్నాను” అని పేర్కొన్నారు.

అయితే, మోడీ-మెలోని భేటీ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్యం, రక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, సాంకేతిక సహకారం వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇటలీ ప్రధాని మెలోని ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన భారత్-ఇటలీ సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇద్దరు నాయకుల మధ్య సన్నిహిత సంబంధాలు పెరుగుతుండగా, ఈ పర్యటన ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. రోమ్‌లో మోడీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే బహుమతులు అందిస్తూ ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రస్తుతం మోడీ ఇటలీ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.