PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్‌తో సత్కారం
- మోడీకి అత్యున్నత గౌరవం
- అగ్రికోలా మెడల్‌తో సత్కారం
- భారతీయ అన్నదాతలకు అంకితం ఇచ్చిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అరుదైన గౌరవం దక్కింది. మోడీకి ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) అత్యున్నత గౌరవమైన ‘అగ్రికోలా మెడల్ 2026’ తో సత్కరించింది. ఇటలీ రాజధాని రోమ్‌లోని FAO ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో FAO డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డాంగ్యూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రధాని మోడీకి అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ క్యూ డాంగ్యూ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం మోడీ చేసిన కృషికి గుర్తింపుగానే ఈ అవార్డును అందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, ఆహార భద్రత బలోపేతం, రైతుల సంక్షేమం కోసం మోడీ ప్రభుత్వం అమలు చేసిన పలు కీలక పథకాలను ప్రశంసించారు. అలాగే ఆకలి, పేదరిక నిర్మూలన, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత సాధనలో FAO లక్ష్యాలకు భారత్ అందిస్తున్న మద్దతును కొనియాడారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మోడీ చేస్తున్న కృషిని కూడా FAO డీజీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా భారత జీ20 అధ్యక్షత్వ కాలంలో వ్యవసాయాన్ని అంతర్జాతీయ అజెండాలో కీలక అంశంగా నిలిపిన విధానాన్ని అభినందించారు.
Also Read
భారత వ్యవసాయ రంగంలో రైతు కేంద్రిత సంస్కరణలు, వినూత్న విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా మోడీ చూపిన నాయకత్వాన్ని FAO ప్రశంసించింది. మోడీ నాయకత్వంలో అమలైన భారీ ఆహార భద్రత పథకాలు, కోట్లాది రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం, సహజ వ్యవసాయం ప్రోత్సాహం, చిరుధాన్యాల ప్రాచుర్యం వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొంది.
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం కింద 80 కోట్ల మందికి ఆహార సహాయం అందించిన విషయాన్ని FAO ప్రత్యేకంగా గుర్తించింది. అలాగే 11 కోట్లకు పైగా రైతులకు నేరుగా ఆదాయ మద్దతు అందించడం, మిల్లెట్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం వంటి చర్యలను ప్రశంసించింది.
డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రపంచ ప్రజా వనరుగా మోడీ ప్రతిపాదించిన అంశాన్ని కూడా FAO కొనియాడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో డిజిటల్ సాంకేతికతల ద్వారా సేవల అందుబాటును పెంచడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపింది. ఈ చర్యల వల్ల కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడగలిగారని FAO అభిప్రాయపడింది.
మోడీ స్వాగతం..
అగ్రికోలా మెడల్ పతకం అందుకున్న తర్వాత మోడీ మాట్లాడుతూ. ‘‘మా అద్భుతమైన స్వాగతానికి, నాకు అగ్రికోలా పతకంతో గౌరవించినందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) డైరెక్టర్‌కు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశం పట్ల ఆయన స్నేహపూర్వక మాటలకు, FAOకు ఆయన చేసిన సంవత్సరాల సేవలకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది కేవలం నాకు మాత్రమే కాకుండా భారతదేశంలోని కోట్లాది మంది రైతులకు, పశుపోషకులకు, మత్స్య పెంపకందారులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, మన కార్మికులకు లభించిన గౌరవం. మానవ సంక్షేమం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధిని కేంద్రంగా చేసుకున్న భారతదేశ నిబద్ధతకు కూడా ఇది ఒక గౌరవం. నేను ఈ పతకాన్ని అత్యంత వినయంతో స్వీకరిస్తూ.. భారతదేశ అన్నదాతకు అంకితం చేస్తున్నాను..’’ అని మోడీ తెలిపారు.
#WATCH | Rome, Italy: Food and Agriculture Organization of the United Nations (FAO) confers FAO Agricola Medal on Prime Minister Narendra Modi.
(Video: ANI/DD) pic.twitter.com/3mHUDExcE7
— ANI (@ANI) May 20, 2026
#WATCH | Rome, Italy: Prime Minister Narendra Modi says, "For our wonderful welcome and for honouring me with Agricola Medal, I express heartfelt gratitude to FAO (Food and Agriculture Organization of the United Nations) Director. For his friendly words for India and for his… https://t.co/WRHwa5n4w6 pic.twitter.com/MYndE49dWQ
— ANI (@ANI) May 20, 2026
తాజావార్తలు
-
PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్‌తో సత్కారం
-
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. అద్భుతమైన రేంజ్, ఫీచర్లు.. ధరలు కేవలం రూ.44,990 నుండి ప్రారంభం
-
Modi-Meloni: హైలెట్‌గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!