Site icon NTV Telugu

G20 Summit: ఐటీ దిగ్గజాలతో ప్రధాని మోడీ భేటీ.. భారత్‌తో సంబంధాలు పెంచుకోవాలని పిలుపు

Modi

Modi

దక్షిణాఫ్రికాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం మోడీ జోహన్నెస్‌బర్గ్‌‌కు వెళ్లారు. మూడు రోజులు పాటు జరిగే జీ20 సమ్మిట్‌లో భారత్ అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే ఆయా దేశాధినేతలను కలిసి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇటీవల జపాన్ నూతన ప్రధానిగా ఎన్నికైన సనే తకైచితో సహా పలువురు నాయకులను కలవనున్నారు.

ఇది కూడా చదవండి: Trump-Zohran Mamdani: వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమైన మమ్దానీ.. ట్రంప్‌తో చర్చలు

ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శుక్రవారం భారత సంతతికి చెందిన టెక్ వ్యవస్థాపకులతో సమావేశం అయ్యారు. ఫిన్‌టెక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికరాలు, మరిన్ని రంగాల్లో పని చేస్తున్న లీడర్స్‌తో సంభాషించారు. భారతదేశంతో సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని.. మన ప్రజలతో దగ్గరగా పనిచేయాలని టెక్ దిగ్గజాలకు మోడీ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Off The Record: కడియం, దానంలపై వేటు తప్పదా?.. అందుకే ఆచితూచి వ్యవహారమా?

ఇక దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయ సమాజంతో మోడీ సంభాషించారు. వివిధ అంశాలపై తమ అనుభవాలను మోడీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో భారతదేశం సాధించిన పురోగతిని మోడీ అభినందించారు. ఇక యోగా, ఆయుర్వేదం వంటి అభ్యాసాలతో సహా దక్షిణాఫ్రికా ప్రజల్లో భారతీయ సంస్కృతికి ప్రజాదరణ పెంచాలని మోడీ కోరారు.

 

 

 

Exit mobile version