NTV Telugu Site icon

Modi-JD Vance: మోడీని కలిసిన అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబం

Us

Us

ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. మంగళవారం ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్‌తో సమావేశమయ్యారు. ఏఐ సదస్సు అనంతరం వారి భేటీ జరిగింది. సదస్సులో మోడీ బాగా మాట్లాడారని జేడీ వాన్స్‌ ప్రశంసించారు. అంతేకాకుండా ట్రంప్ మొదటి పరిపాలన కాలంలో కలిసి పని చేసిన విషయాలను మోడీ గుర్తుచేశారు. వాషింగ్టన్ అణు సాంకేతిక పరిజ్ఞానంపై జేడీ వాన్స్-మోడీ మధ్య చర్చలు జరిగాయని వైట్‌హౌస్ తెలిపింది. అంతేకాకుండా ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించారని పేర్కొంది.

ఇక ప్రధాని మోడీ ఫిబ్రవరి 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 13న వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశం కానున్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ఆయన్ను కలిసిన ప్రపంచ నాయకుల్లో మోడీ ఒక్కరు కావడం విశేషం. అంతేకాకుండా కొద్ది రోజులకే ట్రంప్ నుంచి మోడీకి ఆహ్వానం రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.