Site icon NTV Telugu

G7 Summit: జీ7 సమ్మిట్‌లో ప్రధాని మోడీ-మార్క్ కార్నీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ

Modi1

Modi1

ప్రధాని మోడీ కెనడాలో పర్యటిస్తున్నారు. జీ 7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు మంగళవారం కెనడా చేరుకున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ 7 సమ్మిట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి జీ 7లో భారత్ భాగస్వామ్యం కాకపోయినా.. 2019 నుంచి మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతున్నారు. అయితే గతేడాది జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో కెనడాతో భారత్ సంబంధాలు క్షీణించాయి. తిరిగి ఇన్ని రోజులకు మార్క్ కార్నీ రాకతో తిరిగి సంబంధాలు పునరుద్ధరించబడుతున్నాయి.

జీ 7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ- కెనడా ప్రధాని మార్క్ కార్నీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమావేశంతో తిరిగి ఇరు దేశాల మధ్య సంబంధాలు పున:ప్రారంభమైనట్లుగా సంకేతాలు ఇచ్చారు. భారత్-కెనడా సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాలు ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడదామని.. కలిసి ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేద్దామని మోడీ కోరారు. రెండు దేశాలు కలిసి పని చేస్తే.. వనరులన్నింటినీ సముచితంగా ఉపయోగించుకుంటే మానవాళి సంక్షేమం కోసం పని చేయగలమని అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: PEDDI : ‘పెద్ది’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ .. ఇండియన్ సినిమాకు న్యూ బెంచ్‌మార్క్?

మార్క్ కార్నీ మాట్లాడుతూ. జీ 7లో మోడీకి ఆతిథ్యం ఇవ్వడం గొప్ప గౌరవమని అభిప్రాయపడ్డారు. 2018 నుంచి భారతదేశం జీ7లో పాల్గొంటోందని.. ఇది దేశం యొక్క ప్రాముఖ్యతకు.. నాయకత్వానికి నిదర్శనం అన్నారు. కలిసి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇదొక వేదిక అన్నారు. ఐఏ భవిష్యత్, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. ఇతర అంశాలకు వ్యతిరేకంగా కలిసి పోరాటం చేద్దామని కార్నీ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: ENG vs IND: బుమ్రా ఆడొద్దని ఇంగ్లండ్‌ టీమ్‌ కోరుకుంటోంది.. బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Exit mobile version