PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
- యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు
- భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
- క్రికెట్ రెండు దేశాలను కలిపిన వారధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మెల్బోర్న్లోని ప్రముఖ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)ను సందర్శించి యువ క్రికెటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రీడా సంబంధాలను మరింత బలోపేతం చేసే ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ను అధికారికంగా ప్రారంభించారు.
ఎంసీజీ సందర్శన ఎంతో ప్రత్యేకం
ఎంసీజీలో ప్రసంగించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రతి భారతీయుడికి ఈ స్టేడియంలో అడుగుపెట్టడం రెండు భావోద్వేగాలను కలిగిస్తుందని అన్నారు. ఒకటి భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉత్సాహం కాగా, మరొకటి రెండు దేశాల్లోనూ క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా ప్రజల అభిమానం, భావోద్వేగంగా మారిందనే విషయాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు. అయితే ఈ రోజు చివరి ఓవర్ ఉత్కంఠ లేదని, ఆటపై ఆనందం, రెండు దేశాల స్నేహం, భవిష్యత్ ఛాంపియన్ల ఉత్సాహం మాత్రమే కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ప్రారంభం
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ సమక్షంలో ఇండియా-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్‌మ్యాప్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ, ఈ కార్యక్రమం ద్వారా కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా ఇతర క్రీడల్లో కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ఈ సహకారంలో భాగంగా క్రీడా శిక్షణ (Sports Training), స్పోర్ట్స్ సైన్స్, ఆధునిక క్రీడా సాంకేతికత, ప్రతిభ అభివృద్ధి, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంచనున్నట్లు వెల్లడించారు.
క్రికెట్ రెండు దేశాలను కలిపిన వారధి
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో తన ప్రతి భేటీలోనూ క్రికెట్ సహజంగానే చర్చకు వస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని స్టేడియాన్ని ఇద్దరూ కలిసి సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. మెల్బోర్న్లో కూడా మాజీ క్రికెట్ దిగ్గజాలు స్టీవ్ వా, లిసా స్టాలేకర్ సమక్షంలో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ప్రతిపక్ష నేతతో కూడా భేటీ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ, ఆ దేశ ప్రతిపక్ష నాయకుడు అంగస్ టేలర్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా భారత్-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.
భారత్‌తో సంబంధాలను మరింత విస్తరించేందుకు ఆస్ట్రేలియాలోని ప్రధాన రాజకీయ పార్టీల నుంచి కూడా విస్తృత మద్దతు ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కీలక ఒప్పందాలతో బలపడిన ద్వైపాక్షిక సంబంధాలు
జూలై 8న ఆస్ట్రేలియాకు చేరుకున్న ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ముఖ్యంగా పౌర అణుశక్తి (Civil Nuclear Energy), సముద్ర భద్రత (Maritime Security), కీలక ఖనిజాలు (Critical Minerals), రక్షణ సహకారం, ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ, కీలక సాంకేతికతలు, సరఫరా గొలుసులు (Supply Chains) వంటి రంగాల్లో మొత్తం 18 కీలక ఒప్పందాలు కుదిరాయి.
CECAపై వేగవంతమైన చర్యలకు పిలుపు
భారత్-ఆస్ట్రేలియా సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (CECA)ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోడీ కోరారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరింత వేగంగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగం
ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ “మెల్బోర్న్ మీట్స్ మోడీ” కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్ కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటన భారత్-ఆస్ట్రేలియా సంబంధాల్లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. క్రీడలు, రక్షణ, అణుశక్తి, సముద్ర భద్రత, వాణిజ్యం, సాంకేతికత వంటి అనేక రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నాయి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!