NTV Telugu Site icon

Ukraine Crisis: పుతిన్‌తో ప్రధాని మోడీ చర్చలు..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అన్ని దేశాలను టెన్షన్‌ పెడుతున్నాయి.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా.. ఆ దేశ రాజధాని వైపు దూసుకెళ్తుండగా.. మరోవైపు ఉక్రెయిన్‌ వ్యవహారంలో రష్యా తగిన మూల్యం చెల్లించకతప్పదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది.. ఇక, ఉక్రెయిన్‌ నుంచి కొంత మంది భారతీయులను తరలించినా.. ఇంకా చాలా మంది ఉక్రెయిన్‌లో ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయ పౌరుల భద్రత, క్షేమం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు ప్రధాని మోడీ.. ఉక్రెయిన్‌కు సంబంధించిన తాజా పరిణామాలను పుతిన్‌.. ప్రధాని మోడీకి వివరించారు. దీనిపై భారత ప్రధాని కొన్ని సలహాలను రష్యాకు ఇచ్చారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 25, శుక్రవారం దినఫలాలు

ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినట్టు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.. ఉక్రెయిన్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాల గురించి మోడీకి పుతిన్ వివరించగా.. నాటో, రష్యా మధ్య విభేదాలు.. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారమవుతాయని పునరుద్ఘాటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రష్యా చేస్తున్న హింసను తక్షణమే విరమించుకోవాలని పుతిన్‌కి విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన చర్చలతో పాటు పరస్పరం సంభాషణల మార్గానికి పిలుపునిచ్చిన భారత ప్రధాని.. వీటితో పాటు ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులు ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు సంబంధించి పుతిన్‌తో చర్చించారు.. అక్కడ ఉంటున్న విద్యార్దులపై భారతదేశంలో ఆందోళనలు నెలకొన్న విషయాన్ని ఫోన్‌లో వెల్లడించారు.