PM Modi Can Convince Putin To End Hostilities In Ukraine says White House: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని ఒప్పించి, ఉక్రెయిన్‌పై ఆ దేశం కొనసాగిస్తున్న దురాక్రమణను ఆపే శక్తి భారత ప్రధాని మోడీకి ఉందని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ అభిప్రాయపడ్డారు. పుతిన్, మోడీ మధ్య చర్చల కోసం తాము ఎలాంటి ప్రయత్నాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో సాగుతున్న దురాక్రమణను ఆపేందుకు అమెరికా ఎటువంటి ప్రయత్నాన్ని అయినా స్వాగతిస్తుందని అన్నారు. ఇప్పటికీ ఆలస్యం అవ్వలేదని, ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పెట్టేందుకు పుతిన్‌కి ఇంకా సమయం ఉందని, అతడ్ని మోడీ ఒప్పించగలరని జాన్ కిర్బీ పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపగలరా? లేక ఆ పరిస్థితులు చెయ్యి దాటిపోయాయా? అని ప్రశ్న ఎదురైనప్పుడు.. జాన్ కిర్బీ పై విధంగా స్పందించారు.
Michael Clarke: జడేజా అలా చేస్తే బాగుండేది.. వివాదంపై ఆసీస్ మాజీ కెప్టెన్ స్పందన
‘‘పుతిన్‌తో మాట్లాడించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఏమైనా మార్గాలుంటే, వాటిని అమెరికా సాదరంగా స్వాగిస్తుంది. ఉక్రెయిన్‌పై దురాక్రమణను నిలిపివేయమని పుతిన్‌ని ఒప్పించే శక్తి మోడీకి ఉంది. ఈ యుద్ధం ఈరోజే ఆగిపోవాలి’’ అని జాన్ కిర్బీ చెప్పుకొచ్చారు. పుతిన్‌ను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కలిసిన మరుసటి రోజే జాన్ కిర్బీ ఆ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులకు ఒకే ఒక్క వ్యక్తి కారకుడని, అది పుతిన్ అని జాన్ తెలిపారు. పుతిన్ తలచుకుంటే, ఇప్పటికిప్పుడే ఈ యుద్ధానికి ముగింపు పలకొచ్చని అభిప్రాయపడ్డారు. ఎనర్జీ, పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌పై క్రూజ్ మిసైల్స్ ద్వారా దాడులు చేయిస్తూ.. ఉక్రెయిన్‌ని పుతిన్ అంధకారంలోకి నెట్టేశాడని, దీంతో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే చర్చల ద్వారా ఈ యుద్ధానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భావిస్తున్నారని, ఒక బలమైన చెయ్యి సహకారంతో అది సాధ్యమవుతుందని ఆయన అనుకుంటున్నారని జాన్ కిర్బీ పేర్కొన్నారు.
Formula-E: దుమ్ము రేపనున్న రేసర్లు.. హోరెత్తనున్న సాగర తీరం
ఇదిలావుండగా.. ఇరు దేశాల అధ్యక్షులతో ప్రధాని మోడీ ఇప్పటికే పలుసార్లు మాట్లాడారు. చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కించుకోవాల్సిందిగా ఇద్దరినీ సూచించారు. ఇది యుద్ధాల తరం కాదని, ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కించాలని ఉజ్బెకిస్తాన్‌లో నిర్వహించిన సమ్మిట్‌లో పుతిన్‌కు మోడీ చెప్పారు. అటు.. డిసెంబర్‌లో జెలెన్‌స్కీతో ఫోన్‌లో సంభాషించినప్పుడు 10 పాయింట్లతో కూడిన పీస్ ఫార్ములా గురించి చర్చించారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితుల గురించి పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. తమ మధ్య ఉన్న విభేదాలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని కనుగోవాలని మోడీ పునరుద్ఘాటించారు.