NTV Telugu Site icon

Modi-Putin Meeting: నేడు మోడీ- పుతిన్ మధ్య కీలక భేటీ.. ఉక్రెయిన్ అంశం చర్చకు వచ్చేనా..?

Modi Puthin

Modi Puthin

Modi-Putin Meeting: భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం రష్యాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో- ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ నాయకత్వాన్ని, విజయాలను అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. ‘ నా ప్రియమైన స్నేహితుడు అంటూ మోడీని కౌగిలించుకున్నాడు.. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోడీకి అభినందనలు చెప్పారు. మోడీ అంకిత భావంతో కృషి చేస్తారు.. శక్తిమంతమైన ఆయన నాయకత్వంలో భారత్ అభివృద్ది పథంలో దూసుకుపోతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు.

Read Also: CM Revanth Reddy: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి..

కాగా, మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు. సమావేశాల అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రష్యా మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వీరి భేటీలో ఉక్రెయిన్ తో యుద్ధం సహా కీలక అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉందని రష్యా స్థానిక మీడియా తెలిపింది. అయితే, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని మంత్రి అయ్యాక ఆయనకు ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం.. అలాగే, ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు మోడీ వెళ్లడం ఇదే తొలిసారి.