Site icon NTV Telugu

Zelensky: ‘‘ప్లీజ్ ఉక్రెయిన్‌కు రండి’’.. ట్రంప్‌కి జెలెన్స్కీ ఆహ్వానం..

Trump

Trump

Zelensky: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తమ దేశానికి రావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానించారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా దాడుల వల్ల కలిగిన విధ్వంసాన్ని చూడాలని కోరారు. ‘‘దయచేసి, ఏ విధమైన నిర్ణయాలు, ఏ రకమైన చర్చలు జరపడానికి ముందు, ఉక్రెయిన్‌లో ప్రజలు, ఆస్పత్రులు, చర్చిలు, పిల్లలు ఎలా నాశనం చేయబడ్డారో, చనిపోయారో చూడటానికి రండి’’ అని ఆదివారం జెలెన్స్కీ, ట్రంప్‌ని కోరారు. ఉక్రెయిన్‌కి వస్తే పుతిన్ ఏమి చేశాడో మీరు అర్థం చేసుకుంటారని, మీరు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారో మీకు అర్థం అవుతుందని జెలెన్స్కీ అన్నారు.

Read Also: CLP Meeting: సీఎం అధ్యక్షతన సీఎల్పీ సమావేశం.. ఆ అంశాలపై దిశానిర్దేశం!

ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌తో వైట్‌ హౌజ్‌లో జెలెన్స్కీ సమావేశయ్యారు. ఆ సమయంలో ట్రంప్, జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదం సంచలనంగా మారింది. అమెరికా ఉక్రెయిన్ మధ్య మినరల్ డీల్ కుదరలేదు. ఈ వాగ్వాదం తర్వాత తొలిసారిగా ట్రంప్‌ని జెలెన్స్కీ తన దేశానికి రావాలని కోరారు. మూడు ఏళ్లుగా జరుగుతున్న యుద్ధాన్ని ట్రంప్ ముగించాలని అనుకుంటున్నారు, రష్యాతో ప్రత్యక్ష చర్చలు జరుపుతున్నారు. యుద్ధాన్ని ముగించడం పుతిన్‌కి ఇష్టం లేదని, పుతిన్ ఉక్రెయిన్‌ని పూర్తిగా నాశనం చేయాలని అనుకుంటున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. కాల్పుల విరమణ ఎందుకు పనిచేయడం లేదని అడిగితే, పుతిన్‌ని నమ్మలేమని నేను ట్రంప్‌తో చాలా సార్లు చెప్పానని అన్నారు.

Exit mobile version