NTV Telugu Site icon

Plane Crash: మా విమానం రష్యా వల్లే కూలింది.. అజర్‌బైజాన్ ప్రెసిడెంట్..

Plane Crash

Plane Crash

Plane Crash: కజకిస్తాన్‌లో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 38 మంది మరణించగా, 29 మంది గాయపడ్డారు. బాకు నుంచి రష్యాలోని చెచన్యాలోని గ్రోజీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా గ్రోజీలో విమానం ల్యాండింగ్ తిరస్కరించిన క్రమంలో కాస్పియన్ సముద్రం వైపుగా మళ్లీంచబడింది. చివరకు కజకిస్తాన్ అక్టౌ నగరంలో కూలిపోయింది.

Read Also: Viral News: ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన మామ.. పెళ్లి కూతురు ఇంటిపై విమానం నుంచి డబ్బుల వర్షం(వీడియో)

ఈ విమానం ప్రమాదంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నారు. రష్యా ఉపరితలం నుంచి ఏదైనా క్షిపణి ఢీకొట్టడం వల్లే క్రాష్ అయినట్లు అనుమానిస్తున్నారు. అయితే, శనివారం ఈ ప్రమాదానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉంటే, రష్యా నుంచి వచ్చిన మిస్సైల్ దాడి చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు అజర్‌బైజాన్ స్టేట్ టెలివిజన్‌ని ఉటంకిస్తూ రాయిటర్స్ ఆదివారం నివేదించింది. ఈ ఘటనపై అజర్‌బైజాన్ అధ్యక్షుడు అలియేవ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రష్యాలోని కొన్ని వర్గాలు విమాన ప్రమాదంపై తప్పుడు కథనాలు ప్రచురించి, నిజాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి ఫైర్ చేయడం వల్లే మా విమానం కూలిపోయినట్లు చెప్పారు.

వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పిన ఒక రోజు తర్వాత అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకునేందుకు రష్యా గగనతల రక్షణ వ్యవస్థ ఈ ప్రాంతంలో యాక్టివేట్‌గా ఉంది. దీని వల్లే విమానంపైకి రష్యా మిస్సైల్ ఫైర్ చేసినట్లు తెలుస్తోంది.

Show comments