Site icon NTV Telugu

South sudan: కూలిన విమానం.. 20 మంది మృతి

Ap

Ap

దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడి సహా 20 మంది చనిపోయారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు చమురు క్షేత్రం సమీపంలో టేకాఫ్ అవుతుండగా విమానం కూలిపోయింది. విమానంలో మొత్తం 21 మంది ఉండగా.. ఒక్కరు మినహా మిగతా 20 మంది దుర్మరణం చెందారు.

ఇది కూడా చదవండి: CPI Ramakrishna: కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్..

విమానాశ్రయానికి 500 మీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఒక్కరు మినహా మిగతా 20 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. విమానంలో ఇద్దరు పైలట్లతో సహా 21 మంది ఉన్నారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్‌ పయనీర్‌ ఆపరేటింగ్‌ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే రన్‌వే నుంచి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా విమానం కూలిపోయింది. సంఘటనాస్థలంలో చమురు క్షేత్రాల సమీపంలో విమాన శకలాలు తలక్రిందులుగా పడిపోయాయి. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న విమాన శిధిలాలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇది కూడా చదవండి: Kandula Durgesh: గుడ్‌న్యూస్.. త్వరలో అర్ధరాత్రి వరకు హోటల్స్ ఓపెన్..

ప్రమాదంపై సౌత్‌ సూడాన్‌ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్‌వెచ్ బిపాల్ బోత్ స్పందించారు. విమానం ప్రమాదంలో 20 మంది మరణించారని, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు. స్థానిక అధికారుల వివరాల మేరకు.. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్‌ సూడాన్‌, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.

ఇది కూడా చదవండి: Kejriwal: కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు.. ఫిబ్రవరి 17న హాజరుకావాలని ఆదేశం

Exit mobile version