Site icon NTV Telugu

Plane Crash: అమెరికాలో రోడ్డుపై కూలిన విమానం.. వీడియో వైరల్

Planecrash

Planecrash

అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. జార్జియాలోని గైనెస్‌విల్లేలో రోడ్డుపై చిన్న విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. క్రాష్ ల్యాండింగ్ కారణంగా అనేక కార్లను ఢీకొట్టి ఆగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీడియా నివేదికల ప్రకారం.. సింగిల్ ఇంజిన్ విమానం బ్రౌన్స్ బ్రిడ్జ్-పెర్ల్ నిక్స్ పార్క్‌వే దగ్గర చిన్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. హాకర్ బీచ్‌క్రాఫ్ట్ BE-36ను నడుపుతున్న పైలట్ మధ్యాహ్నం 12:10 గంటలకు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేశాడు.

US నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రకారం.. విమానం గైనెస్‌విల్లెలోని లీ గిల్మర్ మెమోరియల్ విమానాశ్రయం నుంచి బయలుదేరి కాంటన్‌లోని చెరోకీ కౌంటీ ప్రాంతీయ విమానాశ్రయానికి వెళుతోంది. మార్గమధ్యలో విమానం ఇంజిన్‌‌లో వైఫల్యం చోటుచేసుకుంది. దీంతో విమానం రద్దీగా ఉండే రహదారిపై అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటికే అనేక వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే మూడు కార్లను ఢీకొట్టి ఆగిపోయింది.

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లుగా గమనించాడు. తిరిగి గైనెస్‌విల్లేలో ల్యాండ్ చేయాలనుకున్నాడు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అందిన ఆడియోలో పైలట్ సహాయం కోసం అరుస్తూ… ‘‘మేడే, మేడే, మేడే… గైనెస్‌విల్లే’’ అని అంటున్నట్లు వినిపించింది. ఇక పైలట్‌‌కు కూడా ప్రాణం మీద ఆశలు పోయినట్లు అనిపించింది. చనిపోతానని భావించినట్లు ఉన్నాడు. వెంటనే అతడు ‘‘నేను రాలేనేమో.. దయచేసి నా భార్యతో… నా తల్లిదండ్రులతో చెప్పండి. నేను చాలా ప్రేమిస్తున్నానని చెప్పండి..’’ అని పైలట్ వ్యాఖ్యానించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Sergio Gor-Piyush Goyal: సుంకాలు జీరో చేసుంటే క్రికెట్ మ్యాచ్ అమెరికానే గెలిచేది.. విందులో గోయల్ నవ్వులు.. పువ్వులు

విమానం రద్దీగా ఉండే రోడ్డుపై ల్యాండ్ అయి అనేక వాహనాలను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అనేక మందికి స్వల్ప గాయాలు అయ్యాయిని చెప్పారు. విమానం కుడి వైపు రెక్క వాహనాలు ఢీకొట్టిందని వెల్లడించారు. విమానం ఇంధన ట్యాంక్ విరిగిపోయి వాహనాలు ఢీకొట్టినట్లుగా చెప్పారు. అయితే ఎలాంటి పేలుడు సంభవించలేదని.. పైలట్ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.

Exit mobile version