Site icon NTV Telugu

Poland: ఎయిర్‌ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి

Poland

Poland

పోలాండ్ ఎయిర్‌ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్‌‌పై మోహన్‌ భాగవత్‌ సంచలన వ్యాఖ్యలు

సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో గురువారం వైమానిక ప్రదర్శన జరిగింది. ఇందుకోసం రిహార్సల్స్ చేస్తుండగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్ బేస్ నుంచి వస్తుండగా ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పోలిష్ ఆర్మీ పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. పైలట్ మృతి పట్ల పోలాండ్ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లా కోసినియాక్-కామిస్జ్ విచారం వ్యక్తం చేశారు. వైమానిక దళానికి గొప్ప నష్టంగా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ తన దేశానికి అంకితభావం, గొప్ప ధైర్యంతో సేవ చేసిన అధికారి అని కొనియాడారు. కుటుంబానికి, ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: జపాన్‌ చేరుకున్న మోడీ.. 2 రోజులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఇక ఎయిర్‌ షోను చూస్తున్న ప్రేక్షకులు విమానం కూలిపోతున్న దృశ్యాలను తమ మొబైల్‌లో చిత్రీకరించారు. జెట్ నేలపై కూలడానికి ముందు విన్యాసాన్ని ప్రదర్శించినట్లు కనిపించింది. అనంతరం నేలపై కూలిపోయి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు చిమ్ముకుంటూ రన్‌వేపై కొన్ని మీటర్ల దూరం వరకు వెళ్లిపోయింది. ఈ సంఘటన రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. పైలట్ ఒక్కరు మాత్రమే చనిపోయారని.. మిగతా వారికి ఎటువంటి గాయాలు కాలేదని సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపారు. ఇక ఈ వారాంతంలో రాడమ్‌లో జరగాల్సిన ఎయిర్‌షో 2025ను రద్దు చేశారు.

 

Exit mobile version