NTV Telugu Site icon

Zelenskyy: ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీకి జేజేలు.. వైట్‌హౌస్‌తో యుద్ధం చేశారంటూ పొగడ్తలు

Trumpzelensky

Trumpzelensky

వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర వాగ్యుద్ధానికి దిగారు. ఇందుకు ప్రపంచ మీడియా వేదిక అయింది. శాంతి చర్చలు సందర్భంగా ట్రంప్-జెలెన్‌ స్కీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ట్రంప్‌కు ధీటుగా జెలెన్‌స్కీ కూడా ఘాటుగా రిప్లై ఇచ్చారు. మధ్యలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా జోక్యం చేసుకున్నారు. అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జేడీ వాన్స్‌ను కూడా కౌంటర్ ఎటాక్ చేశారు. ఇరువురి డైలాగ్ వార్ ప్రపంచ మీడియా కవర్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఖనిజ వనరులు అప్పగించే ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్ స్కీ వెళ్లిపోయారు. జెలెన్ స్కీ.. వైట్‌హౌస్‌కు వచ్చినప్పటి నుంచి కూడా సీరియస్‌గానే ఉన్నారు.

ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజ వనరులను అప్పగించే ఒప్పందంపై సంతకం చేయాలని జెలెన్ స్కీ‌ని ట్రంప్ కోరారు. భవిష్యత్తులో అమెరికా మద్దతు దీనిపైనే ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పారు. ఈ షరతుపై జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ ఓ హంతకుడని, ఆయనతో రాజీ పడే ప్రసక్తే లేదని జెలెన్‌స్కీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా యుద్ధ సమయంలో రష్యా సైనికుల అకృత్యాలకు సంబంధించిన ఫొటోలను ట్రంప్‌కు జెలెన్ స్కీ చూపించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ స్పందిస్తూ.. తాను శాంతిదూతగా ఉండాలని అనుకుంటున్నానని.. ఇలాగే వదిలేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్తోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఎంత చెప్పినా.. జెలెన్ స్కీ తలగ్గొలేదు. ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. మొత్తానికి సమావేశం నుంచి జెలెన్ స్కీ వెళ్లిపోయారు.

ఇది కూడా చదవండి: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్

తాజాగా జెలెన్ స్కీ తీరును ఉక్రెయిన్ ప్రజలు మెచ్చుకుంటున్నారు. జెలెన్ స్కీకి జేజేలు పలుకుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కీర్తిస్తున్నారు. వైట్‌హౌస్‌తో యుద్ధం చేశారంటూ జెలెన్ స్కీని పొగడ్తలతో ముంచెత్తున్నారు. అంతేకాకుండా బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి కూడా జెలెన్ స్కీకి మద్దతు లభిస్తుంది.