US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
- అమెరికా అధికారులకు ఇజ్రాయిల్ నిఘా భయం..
- అధికారుల్ని హెచ్చరించిన పెంటగాన్..
- గూఢచర్యం చేసే ఛాన్స్ ‘‘క్రిటికల్’’గా ఉందని అంచనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Israel: ఇరాన్ యుద్ధం అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను పెంచింది. ఈ పరిణామం తర్వాత అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇజ్రాయిల్ గూఢచర్యంపై తన అధికారుల్ని అలర్ట్ చేసింది. ఇజ్రాయిల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ముప్పు స్థాయిని ‘‘క్రిటికల్’’కు పెంచింది. నివేదికల ప్రకారం, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఇటీవల ఇజ్రాయిల్ గూఢచర్య కార్యకపలాలపై ప్రత్యేక అంచనా నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో ఇజ్రాయిల్‌కు హ్యూమన్ ఇంటెలిజెన్స్, సాంకేతిక నిఘా రంగాల్లో అత్యంత సామర్థ్యం ఉందని పేర్కొంది.
అమెరికా ఉన్నతాధికారులు ఇజ్రాయిల్ పర్యటనలో అప్రమత్తంగా ఉండాలని పెంటగాన్ సూచించింది. తాత్కాలికంగా ఉపయోగించ బర్నర్ ఫోన్లను, ప్రత్యేక కంప్యూటర్లను, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ విధానాలను అనుసరించడం వంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది. హోటల్ గదులు, ఇతర సున్నిత ప్రదేశాల్లో రహస్య అంశాలపై మాట్లాడవద్దని సూచించింది. ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని పరిస్థితులపై ట్రంప్ అంతర్గత సమాచారం, నిర్ణయాలను తెలుసుకోవడానికి ఇజ్రాయిల్ మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు.
Also Read
- Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
- Indus Waters Treaty: భారత్ నీటిని ఆయుధంగా వాడొచ్చు.. పాక్ మంత్రి ఆరోపణ..
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
అయితే, ఈ ఆరోపణల్ని ఇజ్రాయిల్ తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్‌లోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం స్పందిస్తూ.. అమెరికా ప్రభుత్వ అధికారులపై గూఢచర్యం చేస్తున్నామనేది తప్పుడు ఆరోపణలు అని కొట్టిపారేసింది. ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ శత్రుదేశాలపై జరుగుతాయి కానీ, అమెరికా లాంటి మిత్రదేశంపై కాదని చెప్పింది. వైట్ హౌజ్ కూడా ఈ నివేదికల్ని కొట్టిపారేసింది.
ఇరాన్ యుద్ధం అమెరికా, ఇజ్రాయిల్ మధ్య విభేదాలకు కారణమవుతోంది. ట్రంప్ ఇరాన్‌తో సంధి చేసుకోవాలని భావిస్తుంటే, ఇజ్రాయిల్ మాత్రం యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇద్దరి మధ్య ఒక ఫోన్ సంభాషణ హాట్ హాట్‌గా సాగినట్లు తెలుస్తోంది. లెబనాన్ దక్షిణ ప్రాంతంపై వైమానిక దాడులు చేసే ఇజ్రాయిల్ ఆలోచనపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయిల్ ప్రతిష్ట దెబ్బతింటుందని ట్రంప్ అన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!