NTV Telugu Site icon

US: డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ‘ప్రెజర్ ఇష్యూ’.. ప్రయాణికుల చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావం

Usdelta

Usdelta

ఈ మధ్య విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గగనతలంలోకి వెళ్లాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్య ఓ విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు ఆయా ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో కూడా భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.

అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానం గగనతలంలో ఉండగా తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. కొందరి ప్రయాణికుల చెవుల నుంచి.. ముక్కల నుంచి రక్తం కారిపోయింది. మరి కొందరు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్టాల్ లేక్ సిటీ (ఉటా) నుంచి పోర్ట్‌ల్యాండ్ (ఒరెగాన్) వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఒత్తిడికి గురవ్వడంతో వెంటనే విమానం స్టాల్ లేక్‌ సిటీకి తిరిగొచ్చేసింది. అనంతరం మరో విమానంలో వసతి కల్పించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రయాణికులకు జరిగిన అసౌకర్యంపై ఎయిర్‌లైన్ క్షమాపణలు చెప్పింది. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉండగా అధిక ఒత్తిడికి గురైందని పేర్కొంది. బోయింగ్ 737-900 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఒత్తిడి సమస్య ఉందని, అయితే సమస్యకు కారణమేమిటో వివరించలేదు. రిటైర్డ్ డెల్టా పైలట్ వాలెరీ వాకర్ మాట్లాడుతూ.. సాధారణంగా పైలట్ లోపం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

ఇక విమానంలో జరిగిన భయానకమైన సంఘటనలు గురించి ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయని వాపోయిరు. చూస్తుండగానే చెవులు, ముక్కుల నుంచి రక్తస్రావం జరిగిందంటూ చెప్పుకొచ్చారు. చెవులు విపరీతమైన నొప్పికి గురయ్యాయని మరొక ప్రయాణికుడు తెలిపాడు. ఇక విమానం ల్యాండ్ కాగానే ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.