Earthquake: పసిఫిక్ తీరంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. పనామాలోని పసిఫిక్ తీరంలోని బోకా చికా పట్టణానికి సమీపంలో మంగళవారం ఈ భూకంప వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమాన ప్రకారం 5.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప కేంద్ర బోకా చికాకు దక్షిణంగా 71 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
Read Also: Arunachal Pradesh: భారత్‌లో అరుణాచల్ అంతర్భాగం.. చైనా పేరు మార్పులపై అమెరికా..
అయితే భూకంపం వల్ల ఎంత నష్టం సంభవించిందనేది తెలియాల్సి ఉంది. అంతకుముందు మంగళవారం రాత్రి ఫిలిప్పీన్స్ లో భూకంపం సంభవించడంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. రాజధాని మనీలాకు 514 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతలో భూకంపం నమోదు అయింది. దీనికి ముందు పపువా న్యూగినియాలో కూడా భారీ భూకంపం వచ్చింది. 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు భయపడ్డారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.
ప్రస్తుతం భూకంపాలు సంభవించిన ప్రాంతాలు అన్ని పసిఫిక్ మహాసముద్రంలోని ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో సముద్రం అంతర్భాగంలో అగ్నిపర్వాతాల యాక్టివిటీ అధికంగా ఉంటుంది. దీంతో పాటు టెక్టానిక్ ప్లేట్ల కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో తరుచుగా ఇక్కడ భూకంపాలు వస్తుంటాయి.
