NTV Telugu Site icon

Gaza: గాజాలో అంతులేని అగచాట్లు.. ఆకలి కేకలతో అల్లాడుతున్న పాలస్తీనియన్లు

Gaza

Gaza

Gaza: ఇజ్రాయెల్‌ ఆధినంలో ఉన్న గాజాలోని పాలస్తీనియన్లు పడుతున్న బాధలు అంతులేని అగచాట్లకు నిదర్శనం అని చెప్పాలి. కనీసం ఆహారం దొరక్క వాళ్లు అల్లాడిపోతున్నారు. శుక్రవారం నాడు ఖాన్‌యూనిస్‌లోని శరణార్థి శిబిరం దగ్గర ఫ్రీగా ఆహార పంపిణీ చేసే కేంద్రం వద్ద పాలస్తీనా మహిళలు, బాలికలు ఫుడ్ కోసం పెద్ద యుద్ధమే చేశారు. వారి పరిస్థితిని చూసి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల పెరిగిన నేపథ్యంలో గాజాకు ఆహార పంపిణీని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సహాయ సంస్థలు ఇటీవలే ప్రకటించాయి.

Read Also: Pushpa 2: ఆ ఫాన్స్ కి మాకు సంబంధం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కీలక ప్రకటన!

కాగా, గాజా ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లైంది. యుద్ధ తీవ్రత నేపథ్యంలో చాలా కాలంగా వారంతా ఐక్యరాజ్య సమితి సాయంపైనే ఆధారపడి బతుకుతూ జీవనం కొనసాగిస్తున్నారు. దాంతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటడం ఖాయమంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు మళ్లీ స్టార్ట్ చేసినట్లు హమాస్‌ ప్రతినిధి బస్సెమ్‌ నయీమ్‌ వెల్లడించారు. పరస్పరం బందీల విడుదలతో 14 నెలల పై చిలుకు యుద్ధానికి త్వరలోనే ముగింపు పలికే అవకాశం ఉందని పేర్కొన్నారు.