గాజాలో శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికను హమాస్ ఉగ్రవాదులకు అందజేశారు. ఈ ప్రణాళిక అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. సజీవంగా ఉన్న బందీలు.. చనిపోయిన బందీలను వెంటనే విడుదల చేయాలి. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేయాలనేది ప్రణాళిక ఉద్దేశం. ట్రంప్ ప్రణాళికను వివిధ దేశాలు స్వాగతించాయి. యూరోపియన్, మిడిల్ ఈస్ట్ నాయకులంతా స్వాగతించారు. ప్రధాని మోడీ కూడా ట్రంప్ ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.
ఇక పాకిస్థాన్ కూడా బహిరంగంగానే స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వదేశం నుంచి చాలా మంది తీవ్రంగా తప్పుపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Himachal Pradesh: ఓ వీరుడి సోదరి వివాహాన్ని జరిపించిన సైనికులు.. అతిథులు కన్నీటిపర్యంతం
గాజాపై 20 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రకటించగానే 100 శాతం ఆమోదం తెలుపుతున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. అయితే ఈ ప్రణాళికను వాషింగ్టన్‌లోని ముస్లిం మెజారిటీ దేశాల బృందం ఆమోదయోగ్యం లేదని పేర్కొన్నాయి. ఇక ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడంపై పాకిస్థానీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ట్రంప్ ప్రణాళిక పాలస్తీనా రాజ్యానికి వ్యతిరేకంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీకి చెందిన డాన్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం..పాకిస్థాన్ రాజకీయ నాయకులు, విశ్లేషకులు, జర్నలిస్టులు, కార్యకర్తలు ట్రంప్ ప్రణాళికను ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. లొంగిపోయారంటూ అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Stalin: కరూర్‌ను ఒకలా.. మణిపూర్‌ను మరొకలా చూస్తారా? బీజేపీపై సీఎం స్టాలిన్ ఆగ్రహం
ఇక పాకిస్థాన్ మజ్లిస్ వహ్దత్-ఇ-ముస్లిమీన్ (MWM) పార్టీ నాయకుడు అల్లామా రాజా నాసిర్ మాట్లాడుతూ.. ట్రంప్ ప్రణాళిక పాలస్తీనా ప్రజల హక్కులు, కాంక్షలను విస్మరించే లోపభూయిష్టంగా అన్యాయమైన ప్రతిపాదన అని తేల్చి చెప్పారు. బహిరంగ సంభాషణ లేకుండా రూపొందించబడిన ఈ రహస్య ప్రణాళిక పాలస్తీనియన్ల కంటే ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉందన్నారు. పాలస్తీనా రాజ్య హోదా అంశంపై ఈ ప్రణాళిక అస్పష్టంగా ఉందని తెలిపారు.
