Site icon NTV Telugu

Israel-Pakistan: ఇజ్రాయిల్‌తో పాకిస్తాన్ స్నేహం.. నమ్మడం కష్టమైనా ఇదే నిజం..

Asim Munir

Asim Munir

Israel-Pakistan: బయటకు ఇజ్రాయిల్ అంతే శత్రుదేశంగా భావించే పాకిస్తాన్, తెర వెనక మాత్రం ఇజ్రాయిల్ స్నేహాన్ని కోరుకుంటోంది. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌లో తెహ్రీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్‌పీ) పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళల్ని నిర్వహించింది. దీనిని పాక్ ఆర్మీ, పోలీసులు కఠినంగా అణిచివేశారు. సొంత ప్రజలపైనే కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో పలువురు మరణించారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాకిస్తాన్ తన ఆర్మీకి చెందిన 20,000 మంది సైనికుల్ని గాజాకు పంపుతోంది. అమెరికా-ఇజ్రాయిల్ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్‌ (ISF)లో భాగంగా వీరంతా గాజాకు వెళ్లనున్నారు. ఈ దళం ప్రధాన ఉద్దేశం గాజాలో హమాస్‌ను పూర్తిగా తుడిచేయడం, అక్కడ ఉన్న ఆయుధాలు లేకుండా చేయడం. అంటే ఈ చర్యల ఇజ్రాయిల్ అనుకూలంగా ఉంటుంది. ఇజ్రాయిల్ మొసాద్, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) సీనియర్ అధికారులు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రహస్యంగా సమావేశమైన తర్వాత, సైనికుల్ని పంపాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Female Terrorists: మసూద్ అజార్ భారీ కుట్ర.. పాకిస్థాన్ కేంద్రంగా మహిళా ఉగ్రవాదులకు శిక్షణ..

నిజానికి ఇప్పటి వరకు ఇజ్రాయిల్‌ను పాకిస్తాన్ గుర్తించలేదు. పాకిస్తాన్ తన దౌత్య సంబంధాలను పునర్వ్యవస్థీకరించాలని అనుకుంటోంది. గాజాలో తమ పాత్రలో పాటు, పశ్చిమ ఆసియా అభివృద్ధి చెందుతున్న భద్రతా నిర్మాణంలో తనను తాను మరింతగా స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ ఇజ్రాయిల్ భద్రతా కార్యకలాపాల్లో భాగం కావడం ఇదే తొలిసారి. గాజాకు పాక్ దళాలు వెళ్లే చర్చలు జరుగుతున్నాయని పాక్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ హమాస్‌ను పూర్తిగా తుడిచివేయడంతో పాటు, బఫర్ జోన్‌‌‌ను పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

గాజాలో పాకిస్తాన్ సైనికులు అంతర్జాతీయ స్థిరీకరణ దళం (ISF)లో భాగంగా ఉంటారు, ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రిప్ కోసం 20-పాయింట్ల ప్రణాళిక ప్రకారం పాలస్తీనా ఎన్క్లేవ్‌ను పాలస్తీనా అథారిటీ (PA)కి చివరికి అప్పగించే వరకు భద్రతను అందించడానికి ఈ దళం సహకరిస్తుంది. గాజాలో హమాస్ నిరాయుధీకరణకు ఈ దళం పోరాడుతుంది. పాక్ దళాలతో పాటు ఇండోనేషియా, అజర్ బైజాన్ దళాలతో ఈ ఐఎస్ఎఫ్‌లో భాగం కానున్నాయి. దీనికి బదులుగా పాకిస్తాన్ కు అంతర్జాతీయ రుణ సహాయం అందించే ప్యాకేజీలకు ఇజ్రాయిల్, అమెరికా మద్దతు ఉంటుంది. అయితే, గాజాలో పాకిస్తాన్ ఉనికిని ఇరాన్, టర్కీ, ఖతార్ వ్యతిరేకిస్తాయని భావిస్తున్నారు.

Exit mobile version