Site icon NTV Telugu

Pakistan: కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్.. ట్రేడింగ్ నిలిపివేత..

Pakistan Stock Exchange

Pakistan Stock Exchange

Pakistan: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్, భారత్‌తో వాణిజ్యం రద్దు మొత్తంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌ని కుదేలు చేస్తున్నాయి. పాక్ వ్యాప్తంగా ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడుల తర్వాత కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కుప్పకూలింది. పాకిస్తాన్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ KSE-30 ఏకంగా 7200 పాయింట్లు పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్‌ని నిలిపేసింది. వరసగా రెండవ సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసింది. గురువారం ఉదయం కరాచీ, లాహోర్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్ల తర్వాత మార్కెట్ పడిపోవడం ప్రారంభించింది.

Read Also: Indo-Pak tensions: ‘‘జమ్మూ కాశ్మీర్ వెళ్లొద్దు’’.. తన పౌరులకు యూఎస్, యూకే, కెనడా ఆదేశాలు..

KSE 100 ఇండెక్స్ కూడా 5 శాతం (దాదాపు 6,000 పాయింట్లు) కుప్పకూలింది. పాకిస్తాన్ భవితవ్యం రేపు ఐఎంఎఫ్ అందించే ఆర్థిక ప్యాకేజీపై ఆధారపడి ఉంది. ఐఎంఎఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై పాకిస్తాన్ మార్కెట్ ఆశగా ఎదురుచూస్తోంది. నిన్న కూడా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ 3 శాతానికి పైగా పడిపోయింది. మూడీస్ అంచనా ప్రకారం, పెరుగుతున్న ఉద్రిక్తత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింతగా దిగజారుస్తుందని ప్రకటించింది.

Exit mobile version