Site icon NTV Telugu

Ukarine War: ఉక్రెయిన్‌కు పాకిస్తాన్ సాయం.. భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా..

Ukraine Pakistan

Ukraine Pakistan

Pakistan set to dispatch 159 containers of ammunition to Ukraine: రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో పాకిస్తాన్ దేశం ఉక్రెయిన్ కు సహకరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ కు సైనిక సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాాజాగా మరోసారి భారీగా పేలుడు పదార్థాలను పంపాలని యోచిస్తోంది. ప్రొజెక్టైల్స్, ప్రైమర్ లతో పాటు 159 కంటైనర్ల పేలుడు సామాగ్రిని పంపనుంది. పాకిస్తాన్ షిప్పింగ్, బ్రోకరేజ్ సంస్థ ప్రాజెక్ట్ షిప్పింగ్ పాకిస్తాన్ కోసం 159 కంటైనర్ల మందుగుండు సామాగ్రిని కరాచీ పోర్ట్ నుంచి పోలాండ్ లోని గ్డాన్స్క్ పోర్ట్ కు ఈ నెల చివరి వారాల్లో రవాణా చేయాలని యోచిస్తోంది.

Read Also: Somesh Kumar: సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే.. హైకోర్టు ఆదేశం

బిబిసి వెసువియస్ అనే ఓడలో 155 ఎంఎం ప్రొపెల్లింగ్‌లు, ఎం4ఎ2 ప్రొపెల్లింగ్ బ్యాగ్ ఛార్జీలు, ఎం82 ప్రైమర్‌లు, పిడిఎం ఫ్యూజ్‌లు పంపనుంది. అంతకుముందు యూకే తరుపున ఆయుధాలను ఉక్రెయిన్ కు బదిలీ చేయడంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది. ఉక్రెయిన్ ను ఆనుకుని ఉన్న తూర్పు యూరప్ దేశాల్లోని పలు ఆయుధ కంపెనీలు పాకిస్తాన్ ఆయుధాలను సరఫరా చేసేందుకు కీలకంగా మాారాయి. పాకిస్తాన్ ఉక్రెయిన్ కు మందుగుండు సామాగ్రిని పంపించి బదులుగా ఎంఐ-17 హెలికాప్టర్లను అప్ గ్రేడ్ చేయడానికి ఉక్రెయిన్ సాయాన్ని పొందవచ్చు.

పాకిస్తాన్-ఉక్రెయిన్ సైనిక, పారిశ్రామిక సంబంధాలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ 320 కంటే ఎక్కువ ఉక్రెయిన్ టీ-80యూడీ ట్యాంకులను కొనుగోలు చేసింది. 1991-2020 మధ్య ఉక్రెయిన్ -పాకిస్తాన్ మధ్య 1.6 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు జరిగాయి. పాకిస్తాన్ టీ-80యూడీ మరమ్మత్తుల కోసం 85.6 మిలియన్ డాలర్లతో ఉక్రెయిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో పాకిస్తాన్ రావల్పిండి నుంచి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాల బదిలీ జరిగింది. మధ్యధరా ప్రాంతంలోని బ్రిటిష్ ఎయిర్ బేస్ ద్వారా రోమేనియాలోని అవ్రామ్ ఇయాన్కు క్లజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మిలిటరీ విమానాల ద్వారా తరలించినట్లు సమాచారం. పాకిస్తాన్-ఉక్రెయిన్ మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కాశ్మీర్ విషయంపై ఉక్రెయిన్, భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతు తెలిపింది.

Exit mobile version