ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోడీ మంగళవారం ఉదయం పంజాబ్‌లోని ఆదంపూర్‌లో వాయుసేనను కలిసి ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రదర్శించిన తీరును కొనియాడారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా సియాల్‌కోట్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. అయితే ఆదంపూర్ ఎయిర్‌బేస్ ధ్వంసం అయిందంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసింది. కానీ మోడీ టూర్‌తో అదంతా ఫేక్ అని తేలిపోయింది. అదే మాదిరిగా షెహబాజ్ ఫరీఫ్ కూడా సియాల్‌కోట్ నుంచి ఏదో ఒక సందేశం పంపించాలని అనుకున్నారు. కానీ అలాంటి దృశ్యాలు ఏవీ కూడా కనిపించలేదు. జీపులో వచ్చి జీపులో వెళ్లిపోయారు. అంటే ఎయిర్‌బేస్ ధ్వంసమైనట్లేనని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: India Womens Squad : ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..
షరీఫ్ రన్‌వేకు ఎక్కడా దగ్గరగా కనిపించలేదు. ఇక షెహబాజ్ షరీఫ్ విమానంలో వస్తున్న దృశ్యాలు ఏవీ లేవని వర్గాలు పేర్కొన్నాయి. ఆయన జీపులో వస్తున్నట్లు కనిపించింది. దీంతో ఎయిర్‌స్ట్రిప్ పనిచేయడం లేదనే ఊహాగానాలు బలపడుతున్నాయి. మోడీ టూర్‌లో మాత్రం రన్‌వేపై సైనిక విమానాలు కనిపించిన దృశ్యాలు క్లియర్‌గా కనిపించాయి. షరీఫ్ టూర్‌లో మాత్రం అలా కనిపించలేదు.
ఇది కూడా చదవండి: Sofiya Qureshi: మంత్రికి మరో షాక్.. కోర్టు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశం
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది హిందువులను చంపేశారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో పాక్ భారీగా నష్టం చవిచూసింది. 20 శాతానికి పైగా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా 50 మంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Sharing some more glimpses from my visit to AFS Adampur. pic.twitter.com/G9NmoAZvTR
— Narendra Modi (@narendramodi) May 13, 2025
