Shehbaz Sharif: ఎస్సీవోలో మోడీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని వింతైన ప్రసంగం
- ఎస్సీవోలో మోడీ ప్రసంగం తర్వాత పాక్ ప్రధాని వింతైన ప్రసంగం
- ఉగ్రవాదంపై అర్థరహిత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సులో ఉగ్రవాదంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఉగ్రవాదంపై కొన్ని దేశాలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని.. దీంతో మానవాళి మనుగడకు ప్రమాదమని ప్రధాని మోడీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: PM Modi: చనిపోయిన నా తల్లిపై దుర్భాషలా? కాంగ్రెస్, ఆర్జేడీపై మోడీ ఆగ్రహం
Also Read
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
అనంతరం ఎస్సీవో సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వింతైన ప్రసంగం చేశారు. ఉగ్రదాడులకు తమ దేశం బాధిత దేశమని వ్యాఖ్యానించారు. తమ దేశం 90,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయిందని.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో 152 బిలియన్లకు పైగా ఆర్థిక నష్టాలను చూసిందని తెలిపారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు బందీ సంఘటనను గుర్తుచేశారు. పాకిస్థాన్ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తుందన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని విమర్శించారు. ద్వైపాక్షిక ఒప్పందాలను తాము గౌరవిస్తామని పేర్కొన్నారు. అలాగే ఎస్సీవో సభ్యులు కూడా ఇలాంటి సూత్రాలను అనుసరించాలని ఆశిస్తున్నట్లు షరీఫ్ అన్నారు. మోడీ ప్రసంగం తర్వాత షరీఫ్ ప్రసంగం అర్థరహితంగా మారింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటాం.. ట్రంప్ టారిఫ్‌లపై మోడీ ధ్వజం
కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఆమోదయోగ్యమేనా? అని మోడీ ప్రశ్నించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు సహించబోమని స్పష్టంగా చెప్పాలని మోడీ డిమాండ్ చేశారు.నాలుగు దశాబ్దాలుగా భారతదేశం ఉగ్రవాదాన్ని భరిస్తోందని.. పహల్గామ్ ఉగ్రదాడిని మానవత్వాన్ని నమ్మే అన్ని దేశాలు ఖండించాలన్నారు. దీనిపై ఎస్సీవో సభ్యులంతా ఐక్యంగా ఉండాలని మోడీ కోరారు. మోడీ ప్రసంగ సమయంలో షరీఫ్ అక్కడే ఉన్నారు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!