అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య వినాశకరమైన యుద్ధాన్ని ట్రంప్ నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీప్ హాజరయ్యారు. ఇక యూఎన్ సమావేశాల్లో దాదాపు గంట సేపు ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏడు నెలల్లో 7 యుద్ధాలు ఆపానంటూ మళ్లీ గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Maharashtra: మహా ఘోరం.. నీట్‌లో 99.99 శాతం ఉత్తీర్ణత.. అడ్మిషన్ రోజే యువకుడు ఆత్మహత్య
ట్రంప్ ప్రసంగం ముగిసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొగడ్తలతో ముంచెత్తారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని ట్రంపే నిలిపివేశారని.. ప్రపంచ శాంతిని స్థాపించడానికి నిబద్ధత కలిగి ఉన్నారని తెలిపారు. నిజంగా ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ కొనియాడారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు. మా హృదయాల లోతుల్లోంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Baba Horror: స్వామి చైతన్యానందపై విద్యార్థినులు లైంగిక ఆరోపణలు.. పోలీసుల దర్యాప్తు
అయితే ట్రంప్ వాదనను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని.. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగినట్లుగా భారత్ పేర్కొంది. కానీ పాకిస్థాన్ నాయకులు మాత్రం.. ట్రంపే కాల్పుల విరమణకు పూనుకున్నారని చెబుతున్నారు. ఆ మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. వైట్‌హౌస్‌లో నోబెల్ శాంతి బహుమతికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మునీర్‌కు ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు.
రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అర్మేనియా-అజర్‌బైజాన్, కంబోడియా- థాయ్‌లాండ్, ఇజ్రాయెల్-ఇరాన్, భారతదేశం- పాకిస్థాన్, రువాండా-కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఈజిప్ట్- ఇథియోపియా, సెర్బియా -కొసావోల మధ్య వివాదాలను ఆపివేసినట్లు ట్రంప్ పదే పదే చెబుతున్నారు.
ఇదిలా ఉంటే యూఎన్‌లో ముస్లిం దేశాధినేతలతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్-షెహబాబ్ షరీఫ్ ప్రత్యేకంగా సంభాషించారు. ఇక సెప్టెంబర్ 25న వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను పాక్ ప్రధాని కలవనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
