సింధు జలాలు ఏకపక్షంగా నిలిపివేసే అధికారం భారత్‌కు లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఈ చర్య ఢిల్లీ దుష్ట కుట్రగా అభివర్ణించారు. మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌ను సందర్శించిన సందర్భంగా షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Prabas : ప్రభాస్-నీల్ ‘రవణం’ పై ఉన్న గాసిప్స్‌కి పుల్‌స్టాప్..
డాన్ పత్రికలో వచ్చిన నివేదిక ప్రకారం.. సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడానికి భారతదేశానికి అధికారం లేదని వ్యాఖ్యానించారు. సింధు జలాలపై భారతదేశం నిర్ణయం మారకపోవడంపై షరీఫ్ చర్యలు ప్రకటించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది. దేశీయ వనరులతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన డైమర్-భాషా ఆనకట్ట పనులు కూడా వేగవంతం చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ ఆనకట్ట 1980లోనే ప్రారంభించారు. కానీ పర్యావరణం, ఖర్చులు వంటి అనేక అంశాలు తలెత్తడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగింది.
ఇది కూడా చదవండి: Xi Jin ping: అధ్యక్షుడు జిన్‌పింగ్ మిస్సింగ్.. చైనాలో కలకలం
ఇక సింధు జలాల ఒప్పందం అనేది 1960లో భారత్-పాకిస్థాన్ మధ్య కుదిరిన ఒప్పందం. భారతదేశానికి తూర్పు నదులు, పాకిస్థాన్‌కు పశ్చిమ నదుల నుంచి నీటిని కేటాయించారు. ఈ ఒప్పందం ఇప్పటి వరకు సాఫీగానే సాగింది. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో నీళ్లు నిలిచిపోయాయి. పాకిస్థాన్‌కు ఈ సింధు జలాలే ఆధారం. నీళ్లు నిలిచిపోవడంతో పాకిస్థానీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతోంది.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం భారత్.. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపివేసింది. అనంతరం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
