Site icon NTV Telugu

Shahbaz Sharif: “నేను, ఆసిమ్ మునీర్ విదేశాలకు వెళ్లి అడుక్కునే వాళ్లం”.. ఒప్పుకున్న పాక్ ప్రధాని..

Shahbaz Sharif

Shahbaz Sharif

Shahbaz Sharif: పాకిస్తాన్ గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్, చైనా, అమెరికా, గల్ఫ్ దేశాల నుంచి అప్పులు కోరుతోంది. అప్పుల కోసం తాము ఎలా విదేశాలకు తిరుగుతున్నామనే విషయాన్ని సాక్షాత్తు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించిన వీడియో వైరల్‌గా మారింది. తాము విదేశాల్లో భిక్షాటన చేస్తున్నామనే విషయాన్ని పాక్ ప్రధాని అంగీకరించారు.

Read Also: Epstein files: రష్యన్ అమ్మాయితో సె*క్స్, బిల్ గేట్స్‌కు STD.. ఎస్‌స్టీన్ ఫైల్స్ సంచలనం..

తాను, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కలిసి ఇతర దేశాలకు వెళ్లి ఎలా అడుక్కుంటున్నామనే విషయాన్ని షరీఫ్ బహిరంగంగా చెప్పారు. ఈ వీడియోలో ఐఎంఎఫ్ ప్యాకేజీ గురించి ఎలాంటి షరతులకు అంగీకరించాల్సి వచ్చిందో వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని షహబాజ్ షరీప్ తన దుస్థిని ప్రజలకు వివరించారు. ‘‘మాకు సహాయం చేసిన దేశాలకు నేను థాంక్స్ చెబుతున్నా. కానీ అప్పు తీసుకోవడం అనేది బాధ్యతతో కూడిన విషయం. నేను మీకు ఎలా వివరించాలో తెలియదు. నేను, అసిమ్ మునీర్ కలిసి సైలెంట్‌గా ఇతర దేశాలకు వెళ్లి, పాక్ పరిస్థితి, ఐఎంఎఫ్ రుణాల గురించి వివరించి, బిలియన్ డాలర్ల అపపు కోరాల్సి వచ్చింది. అప్పు అడిగే వ్యక్తి తల ఎప్పుడూ వంగే ఉంటుంది’’ అని అన్నారు.

అప్పులు తీసుకున్న తర్వాత కొన్ని షరతులకు అంగీకరించాల్సిందే అని షరీఫ్ అన్నారు.‘‘ఒకసారి అప్పు తీసుకుంటే, ఆ దేశాల నుంచి కొన్ని డిమాండ్లు రావడం సహజం. గౌరవాన్ని కాపాడుకుంటూ అప్పు తీసుకోవడం చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో వారి షరతులు అంగీకరించాల్సిందే’’ అని అన్నారు. కష్టకాలంలో పాకిస్తాన్‌కు చైనా చాలా సాయం చేసిందని, అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ కూడా సహకరించాయని చెప్పారు.

Exit mobile version