NTV Telugu Site icon

Pakistan: “9/11 దాడుల్ని” గుర్తుకు తెచ్చిన పాక్ ఎయిర్‌లైన్ పోస్ట్.. విచారణకు ఆదేశించిన పీఎం షెహబాజ్..

Pakistan

Pakistan

Pakistan: అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన 9/11 ఉగ్రదాడిని తలపించేలా, ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) చేసిన సోషల్ మీడియా పోస్ట్ నవ్వులపాలైంది. పాకిస్తాన్ పరువు తీసింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని విమానాలు ఢీకొన్న తరహాలోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని ఢీకొనేందుకు వెళ్తున్నట్లుగా పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్‌ని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌ని ఏకిపారేశారు.

జనవరి 10న పీఐఏ తన ఎక్స్‌లో.. ఫ్రాన్స్ జెండా బ్యాక్‌గ్రౌండ్‌గా ఈఫిల్ టవర్ వైపు వెళ్తున్న పీఐఏ విమానం ఉన్న ఫోటోని షేర్ చేసి..‘‘పారిస్ మేము ఈ రోజు వస్తున్నాం’’ అంటూ కామెంట్స్ రాసింది. ఇది 9/11 దాడుల్ని గుర్తుకు తెచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కొన్ని రోజుల్లోనే 21 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుంది.

Read Also: Ramesh Bidhuri: ‘‘జింక’’లా తిరుగుతోంది.. సీఎం అతిషీపై మరోసారి రమేష్ బిధురి కామెంట్స్..

అయితే, ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ ప్రకటనను ఎవరు రూపొందించారో దర్యాప్తు చేయాలని ప్రధాని అధికారుల్ని ఆదేశించినట్లు పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అన్నారు. నాలుగేళ్ల నిషేధం అనంతరం, పీఐఏ విమానం జనవరి 10న పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

యూరోపియన్ యూనియన్(ఈయూ) సేఫ్టీ ఏజెన్సీ పాకిస్తాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)పై విధించిన నాలుగేళ్ల బ్యాన్‌ని ఎత్తేసింది. కరాచీలో ల్యాండ్ అవుతున్న సమయంలో పీఐఏకి చెందిన విమానం 2020లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు మరణించారు. అయితే, పాకిస్తాన్ పైలెట్లకు సరైన ట్రైనింగ్ లేదని కారణంగా నిషేధాన్ని విధించింది.