NTV Telugu Site icon

Pakistan: పాక్ వదిలి వెళ్లాలి.. 17 లక్షల మందికి నవంబర్ 1 డెడ్‌లైన్

Afghanistan Vs Pakistan

Afghanistan Vs Pakistan

Pakistan: ఆర్థిక, రాజకీయ అస్థిరత రాజ్యమేలుతున్న పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగాయి. ఇటీవల బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 57 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఈ దాడులకు ఆఫ్ఘాన్ జాతీయులు కారణం కావచ్చని పాకిస్తాన్ నమ్ముతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న ఆఫ్ఘన్ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 1లోగా తమ దేశంలో ఉన్న 17 లక్షల మంది ఆఫ్ఘాన్లు పాకిస్తాస్ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది.

అనుమతి లేకుండా వచ్చని వారంతా తమ దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. వీరందర్ని పాక్ నుంచి తరిమి వేయడానికి చర్యలు మొదలుపెట్టింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత పాకిస్తాన్‌లోకి ఆఫ్ఘాన్ జాతీయుల వలసలు పెరిగాయి. చాలా మంది పాకిస్తాన్ లోకి శరణార్థులుగా వచ్చారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 13 లక్షల మంది ఆఫ్ఘాన్ పౌరులు శరణార్థులుగా రిజిస్టర్ చేయించుకోగా.. మరో 8.8 లక్షల మంది శరణార్థులుగా ధ్రువీకరణ పత్రాలు పొందారు. వీరితో పాటు మరో 17 లక్షల మంది అక్రమంగా పాకిస్తాన్ లోకి చొరబడ్డారని పాక్ అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగిటి ఇటీవల తెలిపారు.

Read Also: Ranbir Kapoor: బ్రేకింగ్: ‘రణబీర్’కి ఈడీ సమన్లు

వీరంతా వెళ్లిపోవాలని, లేకపోతే బలవంతంగా బహిష్కరిస్తామని, నవంబర్ తర్వాత పాస్ పోర్టు, వీసా లేకుంటే ఎవర్నీ దేశంలోకి అనుమతించమని అన్నారు. పాకిస్తాన్ దేశంలో వరసగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో ఆఫ్ఘాన్ పౌరులలే ఉంటున్నారటి. ముఖ్యంగా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో ఉగ్రవాద దాడులు ఎక్కువగాద జరుగుతన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు పాక్ లో మొత్తం 24 ఆత్మాహుతి దాడులు జరిగితే. .అందులో 14 మంది ఆఫ్ఘన్ పౌరులే ఉన్నారని పాక్ చెబుతోంది.

అయితే పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని తాలిబాన్ సర్కార్ చెబుతోంది. కాబూల్ లోని తాలిబాన్ పరిపాలన ప్రతినిధి మాట్లాడుతూ.. పాకిస్తాన్ భద్రతా సమస్యలకు ఆఫ్ఘన్లు కారణం కాదని అన్నారు. పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి, ఆఫ్గన్ శరణార్థులు పాకిస్తాన్ భద్రతా సమస్యలతో సంబంధం కలిగి ఉండరు, వారు స్వచ్ఛందంగా పాకిస్తాన్ విడిచిపెట్టేంత కాలం ఆ దేశంలోనే వారిని ఉండనివ్వాలని అని అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు.