Site icon NTV Telugu

Pakistan-Bangladesh: తలుపులు మూసిన భారత్.. బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ ఆఫర్..

Karachi Port

Karachi Port

Pakistan-Bangladesh: గతేడాది జరిగిన హింసాత్మక అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా పారిపోయి భారత్‌కు వచ్చేసింది. దీని తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లా తాత్కాలిక పాలకుడిగా మారాడు. ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడు. పాకిస్తాన్‌తో స్నేహం చేస్తూ, దేశంలో రాడికల్ ఇస్లామిస్టులను రెచ్చగొడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే, భారత్ బంగ్లాదేశ్‌కు బుద్ధి వచ్చేలా పలు చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగానే భారత్, జనపనార ఉత్పత్తులను దిగుమతిని నిషేధించింది. బంగ్లాదేశ్ జూట్‌ దిగుమతులకు భారత్ తలుపులు మూసివేసింది.

అయితే, దీనిని అదునుగా తీసుకుని పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు ఒక ఆఫర్ ఇచ్చింది. జనపనారతో పాటు ఇతర వస్తువుల ఎగుమతుల కోసం తమ కరాచీ ఓడరేవును ఉపయోగించుకునే అవకాశాన్ని అందించింది. దాదాపుగా 20 ఏళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ -బంగ్లాదేశ్‌ల మధ్య ఢాకాలో జాయింట్ ఎకనామిక్ కమిషన్ (జెఇసి) సమావేశం జరిగింది. దీంట్లోనే ఈ నిర్ణయం వెలువడింది.

Read Also: Pakistan: ఆఫ్ఘానిస్తాన్‌పై డ్రోన్ దాడిలో అమెరికా హస్తం ఉందా..? అందుకు పాక్ సహకరిస్తుందా..?

భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు క్షీణిస్తు్న్న నేపథ్యంలో, పాకిస్తాన్ బంగ్లాకు దగ్గర అవుతోంది. 1971 యుద్ధం ముందు పాకిస్తాన్ చేసిన దురాగతాలను బంగ్లాదేశ్ మరిచిపోయి వ్యవహరిస్తోంది. వారికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన భారత్‌కు వ్యతరేకంగా వ్యవహరిస్తోంది. ఐదు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ కార్గో షిప్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఓడరేవుకు వచ్చింది. తాజా ఒప్పందమే కాకుండా, బంగ్లాదేశ్ జనపనార ఎగుమతుల్ని పెంచడానికి పాకిస్తాన్ జనపనారతో పాటు ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని నిర్ణయించిందని బంగ్లా మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ జనపనార దిగుమతులపై 2 శాతం కస్టమ్ సుంకాన్ని పాకిస్తాన్ తగ్గించింది. మరోవైపు, భారత్ నుంచి బంగ్లాకు మామిడి ఎగుమతులు తగ్గడంతో ఈ గ్యాప్‌ని భర్తీ చేయాలని పాక్ భావిస్తోంది. తమ మామిడి ఎగుమతుల కోసం అనుమతులు ఇవ్వాలని అభ్యర్థిస్తోంది.

గతంలో, బంగ్లాదేశ్ నుండి నేసిన బట్టలు మరియు రెడీమేడ్ దుస్తులను భూ మార్గాల ద్వారా దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం నిషేధించింది. బదులుగా, ఈ వస్తువులను నవీ ముంబైలోని నవా షెవా సముద్ర ఓడరేవు ద్వారా ప్రవేశించడానికి అనుమతించారు. అయితే, ఇది బంగ్లాదేశ్ ఎగుమతులకు లాభదాయకం కాదు. భూ సరిహద్దు దాడటం కాకుండా, సముద్రం గుండా వస్తువులను తరలించడం బంగ్లా ఎగుమతిదారులకు ఖర్చుతో కూడుకున్నది.

Exit mobile version