NTV Telugu Site icon

Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..

Pakistan Another Shock

Pakistan Another Shock

Pakistan Needs To Pay 77 Billion Dollar Debt To China Saudi Arabia: ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆ దేశం.. అధిక విదేశీ బాహ్య రుణాలు, ద్రవ్యోల్బణం, విదేశీమారక నిల్వలతో పోరాడుతోంది. దీనికితోడు రాజకీయ అస్థిరత కూడా తీవ్రంగా ఉంది. ఇవి చాలవన్నట్టు.. పాకిస్తాన్‌పై మరో పిడుగు పడింది. పాక్ పరిస్థితిపై తాజాగా సర్వే చేసిన యూఎస్‌ థింక్‌ ట్యాంక్‌ సంస్థ.. 2026 కల్లా చైనా, సౌదీ అరేబియాలకు దాదాపు రూ. 63 వేల కోట్ల విదేశీ రుణం చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఒకవేళ ఆ రుణాలను చెల్లించకపోతే మాత్రం.. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందిని హెచ్చరించింది.

Actor Vishal: విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే

పాకిస్తాన్ ఇప్పుడు విపరీతమైన ద్రవ్యోల్బణం, ఉగ్రవాద సమస్య, రాజకీయ విభేదాలతో అల్లాడిపోతోందని.. తద్వారా విదేశీ రుణాలను చెల్లించలేని దీనస్థితికి చేరుకునే ప్రమాదం ఉందని తన సర్వేలో ఆ సంస్థ పేర్కొంది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్‌కు.. రాబోయే మూడేళ్లలో చైనా, సౌదీలకు అధిక మొత్తంలో చెల్లించాల్సిన రుణ ఒత్తిడిని ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పింది. ఏప్రిల్‌ 2023 నుంచి జూన్‌ వరకు.. బాహ్య రుణ సేవల భారం సుమారు రూ. 36 వేల కోట్లు చెల్లించాల్సి ఉండటంతో, రానున్న కాలంలో పాక్‌కు తీవ్ర రుణ ఒత్తిడి తప్పదని నివేదిక పేర్కొంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో చైనాను రీఫైనాన్స్ చేయమని ఒప్పించేందుకు పాక్ అధికారులు భావిస్తున్నారని, గతంలో చైనా ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులు అలా చేశాయని ఆ నివేదిక పేర్కొంది. పాక్ ఒకవేళ రీఫైనాన్స్ గురించి చైనాని ఒప్పించగలిగితే.. వచ్చే ఏడాది మరింత సవాలుగా మారుతుందని, రుణ సేవలు దాదాపు రూ. 20 వేల కోట్లకు పైగా పెరుగుతుందని తెలిపింది.

Japanese Military Helicopter: కుప్పకూలిన జపాన్ ఆర్మీ హెలికాప్టర్.. 10 మంది గల్లంతు

మరోవైపు.. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌)ని సంప్రదించింది. ఐఎంఎఫ్ నుంచి రావాల్సిన రూ. 9 వేల కోట్ల నిధుల కోసం వేచి ఉంది. 2019లో పాక్‌కి ఆమోదించిన రూ.53 వేల ఉద్దీపన ప్యాకేజ్‌లో భాగమైన ఈ నిధులు.. గతేడాది నవంబర్ నెలలోనే పాక్‌కి పంపిణీ అవ్వాల్సింది. కానీ.. ఆ నిధులు ఇంతవరకు పాక్‌కి అందలేదు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. 2019కి సంబంధించిన ఈ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్ ఈ ఏడాది జూన్ 30న ముగుస్తుంది. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం.. గడువుకు మించి ప్రోగ్రామ్‌ పొడిగించటం అసాధ్యం. దీని గురించి పాక్‌, ఐఎంఎఫ్‌ మధ్య చర్చలు జరుగుతున్నా.. ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం ఖరారు కాలేదు. తమ ఆర్థిక సమస్య నుంచి బయటపడే సులభమార్గం ఇదొక్కటే ఉన్న నేపథ్యంలో.. ఐఎంఎఫ్ కార్యక్రమాన్ని ఐఎంఎఫ్‌ కార్యక్రమాన్ని పునరుద్ధరించేలా పాక్ ప్రభుత్వం అన్ని కఠిన నిర్ణయాలను తీసుకునేందుకు ముందకొచ్చింది.

Show comments