NTV Telugu Site icon

Pakistan: భారత ఛానెళ్లను ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై పాక్ ప్రభుత్వం చర్యలు..

Pakistan

Pakistan

Pakistan media regulatory body cracks down on cable operators airing Indian content: దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశం పట్ల నిలువెల్లా వ్యతిరేకతను అవలంభిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా భారత కంటెంట్ ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యలేటరీ అథారిటీ నలుగురు కేబుల్ ఆపరేటర్లపై కేసులు పెట్టింది. చట్టవిరుద్ధంగా భారతీయ ఛానెళ్లను ప్రసారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు అవలంభించబోతోంది.

Read Also: Joe Biden: చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు.. మరిన్ని రహస్య పత్రాలు స్వాధీనం..

పాక్ వాణిజ్య నగరం అయిన కరాచీలోని షార్జా కేబుల్ నెట్వర్క్, కరాచీ కేబుల్ సర్వీసెస్, న్యూ శాటిలైట్ కమ్యూనికేషన్స్, స్టార్ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ భారతీయ కంటెంట్ ను ప్రసారం చేస్తుండటంతో వాటిని సీజ్ చేసింది. పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని వారిపై చర్యలు ప్రారంభించింది. దేశంలోని కేబుల్ ఆపరేటర్లందరూ భారతీయ ఛానెళ్లు, కంటెంట్ ను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది.

2016లో స్థానిక టెలివిజన్, ఎఫ్ఎం రేడియో ఛానెళ్లలో భారతీయ కంటెంట్ ను ప్రసారం చేయడాన్ని పాకిస్తాన్ పూర్తిగా నిషేధించింది. అయితే 2017లో లాహోర్ హైకోర్టు దీన్ని ఎత్తేసింది. 2018 లాహోర్ హైకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ.. దేశంలో భారతీయ కంటెంట్ ను ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టు నిషేధించింది. పాకిస్తాన్ కంటెంట్, ఆర్టిస్టులను భారత్ నిషేధించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది.

Show comments