Site icon NTV Telugu

Milk Price In Pakistan: పాక్లో దడ పుట్టిస్తున్న పాల ధర.. ప్రజలు ఏం చేశారంటే..?

Pak

Pak

Milk Price In Pakistan: పాకిస్తాన్ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న వారిపై.. కొత్తగా పాలపై పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో స్థానికంగా పాల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాక్‌లోనే అత్యధికంగా ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం అక్కడి ప్రజలను భయపెడుతున్నాయి. అయితే, పాకిస్థాన్‌ పాలపై ఎలాంటి పన్నూ ఉండేది కాదు.. అలాంటిది గత వారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్‌ పాలపై అక్కడి ప్రభుత్వం ఎకంగా 18 శాతం పన్ను వేసింది. దీంతో పాల ధరలు 25 శాతానికి పైగా పెరిగిపోయాయి. కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్‌ పాల ధర రూ. 370 (పాకిస్తాన్ కరెన్సీ) చేరుకుంది. డాలర్ల ప్రకారం చూస్తే లీటర్‌ పాల ధర 1. 33 డాలర్లుగా ఉండగా.. పారిస్‌లో లీటర్‌ పాల ధర 1.23 డాలర్లు ఉంటే.. మెల్‌బోర్న్‌లో 1.08 డాలర్లు మాత్రమే ఉంది.

Read Also: Keir Starmer: యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ విక్టరీ.. తదుపరి ప్రధానిగా కీర్ స్టామర్

ఇక, పాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోతుందని ఆర్థిక నిపుణులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు, వేతనాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. పాక్‌లో ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గిపోతున్నారు.. ముఖ్యంగా పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇది దారి తీస్తుందనే విషయం ఆందోళన కలిగిస్తుంది. బెయిలవుట్‌ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగానే పాకిస్థాన్‌ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులను పెంచేసింది.

Exit mobile version