Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Hindu Temple Demolition Row: దాదాపు 100 ఏళ్ల పురాతన హిందూ దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారన్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. ఆలయ భవనాన్ని ఎవరూ కూల్చివేయలేదని, జూలై 21న కురిసిన భారీ వర్షాల కారణంగా ఆలయ నిర్మాణం దెబ్బతిందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం స్పష్టం చేసింది. భారత్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో పాకిస్థాన్ తాజాగా తన వివరణ ఇచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నరోవల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయానికి సంబంధించినది. సమీపంలోని మదర్సా కోసం ఆలయ భూమిని ఆక్రమించుకునే ఉద్దేశంతో మత ఛాందసవాదులు ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చివేశారని స్థానిక నివాసితులు, మైనారిటీ సంస్థలు, ఓ రాజకీయ పార్టీ ఆరోపించాయి.
ఈ ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆలయ కూల్చివేత ఘటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిస్సందేహంగా ఖండించింది. పాకిస్థాన్ ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా, దెబ్బతిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయాన్ని పునరుద్ధరించేందుకు పాకిస్థాన్ తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్ కోరింది. పాకిస్థాన్‌లోని మైనారిటీ పౌరుల భద్రతను నిర్ధారించడంతో పాటు వారి మత, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది.
Also Read
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. "మహామంత్రం" జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
- Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
భారత్ అభ్యంతరాల నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం శుక్రవారం తన వాదనను వెల్లడించింది. ఆలయ భవనం కూల్చివేతకు ఎలాంటి ఉద్దేశపూర్వక చర్య కారణం కాదని, జూలై 21న కురిసిన భారీ వర్షాల వల్ల నిర్మాణం దెబ్బతిందని తెలిపింది. స్థానిక అధికారులు ఇప్పటికే వర్షాల వల్ల ఆలయానికి జరిగిన నష్టాన్ని సర్వే చేసినట్లు పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఆలయ భవనాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో ఆలయ కూల్చివేతపై భారత్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ అధికారికంగా తోసిపుచ్చినట్లైంది.
తాజావార్తలు
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!