NTV Telugu Site icon

Pakistan: మూడింట ఒకవంతు పాక్ భూభాగం నీటిలోనే.. భారీ వరదలతో ఏర్పడిన సరస్సులు

Pakistan Floods

Pakistan Floods

PAKISTAN FLOODS-one third of Pakistan underwater: అసలే ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ పరిస్థితి వరదల కారణంగా దారుణంగా మారింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు ఈ ఏడాది రుతుపవన కాలంలో కురిశాయి. దీంతో పాకిస్తాన్ లో ఒక్కసారిగా భీకర వరదలు సంభవించాయి. సింధు నదితో పాటు దాని ఉపనదులు, స్వాత్ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో సింధ్ ప్రావిన్స్, బలూచిస్థాన్ ప్రావిన్సులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో పాటు ఖైబర్ ఫఖ్తుంక్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా తీవ్ర నష్టం ఏర్పడింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ మూడువంతుల భూభాగంలో ఒక వంతు నీటిలోనే ఉంది. సింధు నది వరదల వల్ల కొన్ని ప్రాంతాల్లో కొత్త సరస్సులు ఏర్పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ లో ఏ రేంజ్ లో వరదలు సంభవించాయో అర్థం అవుతోంది. దీంతో పాటు హిమాాలయాలు కూడా పాకిస్తాన్ వరదలకు కారణం అయ్యాయి. ఈ ఏడాది తీవ్రమైన ఉష్ణోగ్రతలు కారణంగా హిమాలయాల్లో హిమపలకలు కరిగాయి. దీంతో వరదల తీవ్రత మరింతగా పెరిగింది.

Read Also: Kishan Reddy: తెలంగాణ విమోచన దినోత్సవానికి హాజరు కావాలంటూ సీఎం కేసీఆర్‌కు లేఖ

“మాన్‌సూన్ ఆన్ స్టెరాయిడ్స్” అని పిలిచే పరిస్థితి వల్ల పాకిస్తాన్ లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ భూభాగం నీటిలో ఉంది. యూరోపియన్ స్పెస్ ఏజెన్సీ తీసిని చిత్రాల్లో పాక్ వరదల పరిస్థితి కనిపించింది. జూన్ మధ్య నుంచి ప్రారంభం అయిన వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు పాకిస్తాన్ లో 1200 మంది మరణించారు.. 3.3 కోట్ల మంది ప్రభావితం అయ్యారు. దేశ చరిత్రలో అత్యంత దారుణమైన వరదలు సంభవించడంతో పంటలు, వ్యవసాయ భూములు, మౌళిక సదుపాయాలు, రోడ్లు, కరెంట్ స్తంభాలు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. పాకిస్తాన్ ఈ దెబ్బ నుంచి కోలుకోవాలంటే 10 బిలియన్ డాలర్లు అవసరం. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్ ఈ పరిస్థితి నుంచి ఇప్పడప్పుడే బయటపడే అవకాశం లేదు. పాకిస్తాన్ వరదల వల్ల అక్కడి రైతులు మరో 50 ఏళ్లు వెనక్కి వెళ్లారు.