NTV Telugu Site icon

Pakistan election: నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో సంకీర్ణం.. ప్రభుత్వం ఏర్పాటు దిశగా చర్చలు..

Pakistan

Pakistan

Pakistan election: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, అస్థిరత నేపథ్యంలో పాకిస్తాన్ ఎన్నికలు జరిగాయి. అయితే, ఈ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ కట్టబెట్టలేదు. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలుపొందారు. అయితే, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అక్కడి ఎన్నికల కమీషన్ ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ బ్యాట్ గుర్తును రద్దు చేయడంతో, అతని మద్దతుదారులు ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. ఇక మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ “పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N)”, బిలావల్ భుట్లోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) పార్టీలు ఎక్కువగా సీట్లనను గెలుచుకున్నాయి.

Read Also: CM Revanth: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..

ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టోలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లుగా ఆ దేశ మీడియా వెల్లడించింది. ఎవరు ఏ పదవిని చేపడుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. తామే ఎన్నికల్లో గెలిచామని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించుకున్నాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కూడా తనదే విజయమని చెబుతున్నారు.

పాకిస్తాన్‌లో గురువారం 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ పార్టీకి 71 స్థానాలు, భుట్టో పార్టీకి 53 స్థానాలను గెలుచుకుంది. మరో 15 నేషనల్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇక శనివారం ఉదయం వరకు వెలువడిన ఫలితాల్లో 99 స్థానాలను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. ఇందులో 88 మంది ఇమ్రాన్ ఖాన్‌కి విధేయులుగా ఉన్నారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 133 సీట్లు కావాలి. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో పాకిస్తాన్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.