Pakistan delegation on secret visit to Israel: ఉప్పు నిప్పుగా ఉండే పాకిస్తాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు చిగురించే అవకాశం కనిపిస్తోంది. ఓ ముస్లిం దేశంగా పాకిస్తాన్ మరో ముస్లిం దేశం అయిన పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ.. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ తో దౌత్యసంబంధాలను పెట్టుకోలేదు. అయితే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో భారత చిరకాల మిత్రదేశం అయిన ఇజ్రాయిల్ తో పాకిస్తాన్ సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతోంది.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు ఈ రోజు బ్రేక్.. ఢిల్లీ వెళ్లిన రాహుల్ గాంధీ
ఇటీవల రహస్యంగా పాకిస్తాన్ మాజీ మంత్రి నేతృత్వంలో ప్రతినిధుల బృందం రహస్యంగా ఇజ్రాయిల్ లో పర్యటించింది. తొమ్మిది మంది సభ్యలతో కూడిన బృందానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్, గతంలో మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన నాసిమ్ అష్రఫ్ నాయకత్వం వహించారు. పాకిస్తాన్ తో పాటు మరో ఇస్లామిక్ కంట్రీ ఇండోనేషియా కూడా ఇజ్రాయిల్ కు వెళ్లింది. పాకిస్తాన్, ఇజ్రాయిల్ తో సంబంధాలు పెట్టుకోవడానికి అమెరికా లాబీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పర్యటనలో పాకిస్తానీ మూలాలు ఉన్న అమెరికన్లు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, ఇజ్రాయిల్ తో సంబంధాలను కోరుకుంటోంది. సాంకేతికత వంటి అంశాలతో పాటు ఆయుధాలు వంటి వాటిని ఇజ్రాయిల్ నుంచి ఆశిస్తోంది పాకిస్తాన్.
మారుతున్న ప్రపంచ రాజకీయాల మధ్య పలు అరబ్ దేశాలు ఇజ్రాయిల్ తో సంబంధాలు పెట్టుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సూడాన్, మొరాకో వంటి దేశాలు ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. దశాబ్ధాలుగా ఇజ్రాయిల్ కు దూరంగా ఉన్న టర్కీ కూడా ఇజ్రాయిల్ తో ప్రస్తుతం సంబంధాలు నెరుపుతోంది. ముస్లిం ప్రపంచంలో ఇరాన్, ఇజ్రాయిల్ దేశానికి బద్ధ శత్రువుగా ఉంది. అయితే ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఎప్పటి నుంచో శతృత్వం ఉంది. ఈ నేపథ్యంలో పలు అరబ్ దేశాలు ఇజ్రాయిల్ తో సంబంధాలు పెట్టుకున్నాయి.
