Site icon NTV Telugu

Pakistan: “రాత్రి 8 గంటల తర్వాత పిల్లలు పుట్టరట”.. పాక్ మంత్రి కొత్త సిద్ధాంతం.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

Pakistan

Pakistan

Pakistan defence minister’s bizarre theory about population growth: పాకిస్తాన్ మంత్రులు, అక్కడి ప్రజల అవివేకం చాలా సందర్భాల్లో చూశాం. తెలిసీతెలియని విధంగా కొత్తకొత్త ప్రతిపాదనలు, సిద్ధాంతాలు పుట్టించడంలో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధహస్తులు. ఏ సమస్య వచ్చినా.. కూడా ఆర్మీ, అటామిక్ ముల్క్ అని చెప్పడం తప్పితే పాకిస్తాన్ పెద్దగా చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వానికి తత్వం బోధపడటం లేదు. ఎంతసేపు భారత్ వ్యతిరేకత, కాశ్మీర్ అంటూ మాట్లాడటం తప్పితే, దేశంలోని ఇతర ప్రాంతాల గురించి ప్రజల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జనాభా పెరుగుదలపై ఓ సిద్ధాంతాన్ని ప్రకటించారు. దీనిపై నెటిజెన్లు ఓ రేంజులో పాక్ మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. ‘‘రాత్రి 8 గంటల వరకు మార్కెట్లు మూతపడిన ప్రదేశాల్లో జనాభా పెరుగుదల తక్కువగా ఉంది’’ అంటూ ఓ విచిత్రమైన సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మంత్రి వ్యాఖ్యలను జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై తెగ కామెంట్లు వస్తున్నాయి.

Read Also: Tragedy: పశ్చిమ బెంగాల్‎లో విషాదం.. తల్లి శవాన్ని 50కి.మీ. మోసిన కొడుకు

‘‘ కొత్త పరిశోధన, రాత్రి 8 గంటల తర్వాత పిల్లలను తయారు చేయడం సాధ్యం కాదు. రాత్రి 8 గంటలకు మార్కెట్లు ముగిసే దేశాల్లో జనాభా పెరగడం లేదు’’ అంటూ నైలా ఇనాయత్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ వాహ్ క్యాలాజిక్ హై’’ అంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేస్తే..మరొకరు ‘‘ మార్కెట్ లో పిల్లలు పుడుతున్నారా..?’’ అంటూ ప్రశ్నించారు. ఈ కామెంట్ చేసిన సందర్భంలో మంత్రి పక్కన ఉన్న మహిళ రియాక్షన్ హైలెట్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్తాన్ మరో శ్రీలంక కాబోతోంది. చివరకు ఉద్యోగులు, సైనికుల జీతాల్లో కోతలు విధించడంతో పాటు విదేశాల్లో ఉన్న ఎంబీసీ ఆస్తులను అమ్మేస్తోంది. తాజాగా విద్యుత్ వినియోగాన్ని తప్పించుకునేందుకు రాత్రి 8 గంటలకే మార్కెట్లు బంద్ చేయాలని ఆదేశించింది. దీంతో చమురు ఖర్చులను ఆదా చేయవచ్చని భావిస్తోంది. ఇక ఉదయం పూటే సమావేశాలు నిర్వహించాలని సూచించింది.

Exit mobile version