Pakistan Israel War: అప్పుడు భారత్, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్.. పాక్‌లో చైనా వ్యవస్థలు విఫలం..!
- ఇస్లామాబాద్‌పై దాడి చేసిన తాలిబాన్ డ్రోన్లు..
- మరోసారి పాక్‌లో చైనీస్ రక్షణ వ్యవస్థలు విఫలం..
- ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా ఇదే పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Israel War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రత పెరిగింది. ఈ రోజు తెల్లవారుజామున పాక్ యుద్ధవిమానాలు కాబూల్, కాందహార్, పక్తియా నగరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. పాక్ రాజధాని ఇస్లా్మాబాద్‌పై డ్రోన్లలో తాలిబాన్లు దాడులు చేశారు. పాక్ ప్రధాని కార్యాయానికి కూతవేటు దూరంలో ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి జరిగింది. మరోవైపు, కరాచీలో కూడా పాక్ హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని ఫైజాబాద్ సమీపంలోని ఒక సైనిక శిబిరం, నౌషెరాలోని ఒక సైనిక కంటోన్మెంట్, జామ్రుద్‌లోని సైనిక కాలనీపై, అబోటాబాద్‌పై దాడులు జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పెద్దగా వైమానిక శక్తి లేకపోయినా తాలిబాన్ల డ్రోన్లు పాకిస్తాన్ రాజధానిని చేరుకున్నాయి.
చైనీస్ వ్యవస్థలు మళ్లీ విఫలమయ్యాయా?
Also Read
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను కనిపెట్టడంలో చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దారుణంగా విఫలమయ్యాయి. మన క్షిపణుల ముందు పాక్ వద్ద సమాధానాలు లేవు. తాజాగా, ఆఫ్ఘానిస్తాన్ చేసిన దాడిలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇస్లామాబాద్ వరకు తాలిబాన్ డ్రోన్లు వస్తున్న గగనతల రక్షణ వ్యవస్థలు కనిపెట్టలేకపోయినట్లు తెలుస్తోంది.
పాక్ వద్ద ఉన్న గగనతల రక్షణ వ్యవస్థలు:
HQ-9 (లాంగ్-రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్): దీని పరిధి 200-300 కి.మీ. ఇది శత్రువుల యుద్ద విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ఇంటర్‌సెప్ట్ చేసి కూల్చేస్తుంది. ఇస్లామాబాద్ చుట్టూ అనేక బ్యాటరీలను మోహరించారు. పాకిస్తాన్ దీనిని 2021 నుంచి ఉపయోగించడం ప్రారంభించింది.
HQ-16 / LY-80 (మీడియం-రేంజ్ ఎయిర్ డిఫెన్స్): దీని పరిధి 40-70 కి.మీ. మధ్యస్థ ఎత్తులో వచ్చే డ్రోన్లు, హెలికాప్టర్లు, జెట్లను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇస్లామాబాద్, పాక్ సరిహద్దుల్లో వీటిని హోరించారు.
FM-90 / HQ-7 (షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్): దీని పరిధి 15 కి.మీ. ఇది తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణుల్ని అడ్డుకుంటుంది.
చైనా నుంచి కొనుక్కున్న ఈ వ్యవస్థలు ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిగా పనిచేయలేదు. భారత్ వద్ద ఉన్న ఎస్-400 మాత్రం పాక్ దాడుల్ని తిప్పికొట్టింది. ఆ సమయంలో పాక్‌లోని చైనా HQ-9 విఫలమైంది. 2025 ఇండో-పాక్ వివాదంలో HQ-9 యొక్క లోపాలు స్పష్టంగా కనిపించాయి – ఇది భారత క్షిపణులను పూర్తిగా అడ్డుకోలేకపోయింది. చైనా వ్యవస్థలు రష్యన్ S-300 యొక్క కాపీలు అని నిపుణులు అంటున్నారు. ఇవి అంత సమర్థవంతంగా పనిచేయలేదు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!