Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..

  • రష్యా న్యూక్లియర్ ఫ్యూయల్ విమానానికి పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్ నో
  • బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన పాకిస్తాన్..
Pakistan Bangladesh

Pakistan Bangladesh

Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లో నిర్మితమవుతున్న తొలి అణు విద్యుత్ కేద్రం రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ కోసం రష్యా నుంచి రావాల్సిన న్యూక్లియర్ ఫ్యూయల్ సరఫరాను అడ్డుకుంది. ఈ ఇంధనాన్ని తీసుకెళ్లున్న రష్యా విమానానికి పాకిస్తాన్ తన గగనతలం(ఎయిర్ స్పేస్)ను మూసేసింది. దీంతో ఈ షిప్‌మెంట్ ఆలస్యమైంది.

రూప్పూర్ ప్రాజెక్టును రష్యాకు చెందిన ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోటాసామ్ నిర్మిస్తోంది. ఫ్యూయర్ డెలివరీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాతే ఎయిర్‌స్పేస్ క్లియరెన్స్ సమస్య ఎదురైందని బంగ్లా అధికారులు తెలిపారు. రష్యా విమానం పాకిస్తాన్ మీదుగా బంగ్లాదేశ్ చేరాల్సి ఉంది. ముందుగా ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదనే దానిపై పాకిస్తాన్ నుంచి క్లారిటీ రాలేదు. దీని తర్వాత ఢాకాలోని పాకిస్తాన్ హైకమిషన్ ‘‘టెక్నికల్, ప్రొసీజురల్ ఇష్యూస్’’ అని పేర్కొంది. దీనికి రాజకీయ కారణాలు ఆపాదించకుండా, సాంకేతిక సమస్యగా చూడాలని పాక్ చెప్పింది.

పాకిస్తాన్ అనుమతి నిరాకరించడంతో రోసాటమ్ ఇంధన డెలివరీని రీషెడ్యూల్ చేసింది. విద్యుత్ సమస్యలతో అల్లాడుతున్న బంగ్లాదేశ్‌కు ఈ అణు విద్యుత్ కేంద్రం చాలా కీలకం. దేశం ప్రస్తుతం విద్యుత్ కొరత, గ్యాస్ కొరతతో అల్లాడుతోంది. ఈ ప్లాంట్ నిర్మితమైతే బంగ్లాదేశ్ విద్యుత్ సమస్యలకు కొంత పరిష్కారం లభించవచ్చు.