Site icon NTV Telugu

PAK vs AFG: కాల్పుల విరమణకు ఒప్పుకున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌..

Afg

Afg

PAK vs AFG: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు, క్రికెటర్లు కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఓ కొలిక్కి వచ్చింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఖతార్‌లోని దోహాలో శనివారం నాడు పాక్, అఫ్గాన్‌ రక్షణ మంత్రులు ఖావాజా ఆసిఫ్, ముల్లా యాకుబ్‌ల మధ్య కొనసాగిన చర్చలు సక్సెస్ అయ్యాయి.

Read Also: Team India loss: అటు మెన్స్.. ఇటు ఉమెన్స్.. ఒకేరోజు రెండు ఓటములు..!

అయితే, పాకిస్థాన్, అఫ్గాన్ మధ్య శాంతి స్థాపన కోసం జరిగిన ఈ చర్చలకు ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించాయి. తక్షణ కాల్పుల విరమణ అమలు చేసేందుకు ఇరు దేశాలు ఒప్పుకున్నాయని ఖతార్‌ విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాల్పుల విరమణ అమలు తీరును సమీక్షించేందుకు తదుపరి మీటింగ్ ను నిర్వహించాలని పాక్- అఫ్గాన్ దేశాలు నిర్ణయించాయని చెప్పుకొచ్చారు.

Exit mobile version