Site icon NTV Telugu

Pakistan: నలుగురు పోలీసులను చంపిన పాక్ తాలిబాన్లు.. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో సమాంతర పాలన..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను పాక్ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోతోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ఆదివారం జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది మరనించారని, పాక్ తాలిబాన్లు దాడి చేశారని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఝోబ్ జిల్లాలోని హైవే చెక్‌పాయింట్ వద్ద దాదాపు డజను మంది తాలిబాన్లు, పోలీసులు, పారామిలిటీర ఫ్రాంటియర్ కానిస్టేబుల్ అధికారులపై దాడి చేశారని, రెండు గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.

Read Also: Faria Abdullah : బీచ్ లో చీర కట్టుతో రచ్చ చేసిన ఫరియా.

ఈ దాడిలో ముగ్గురు పోలీసులు మరియు ఒక ఫ్రాంటియర్ కార్ప్స్ అధికారితో సహా నలుగురు భద్రతా అధికారులు మరణించారు. ఒక ఉగ్రవాది కూడా మరణించాడని, అయితే అతనిని ఇంకా గుర్తించలేదని ఝోబ్ కమిషనర్ సయీద్ ఉమ్రానీ తెెలిపారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) తామే ఈ దాడి చేసినట్లు ప్రకటించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పాక్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను అనుకుని ఉన్న పాకిస్తాన్ ప్రాంతాల్లో క్రమంగా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నెలలో పెషావర్ నగరంలోని పోలీస్ కాంపౌండ్ లోని ఓ మసీదుల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మందికిపైగా అధికారులు మరణించారు. పాక్ తాలిబాన్లే ఈ దాడికి పాల్పడ్డారు.

ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా తాలిబాన్ల పాలన నడుస్తోంది. ఈ ప్రాంతంలో తరుచుగా పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్ ప్రావిన్సులో ‘బలూచ్ లిబరేషన్ ఫ్రంట్’ సైన్యం, పోలీసులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగే సీపెక్(చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్) పనులను ఎప్పటికప్పుడు బీఎల్ఎఫ్ అడ్డుకుంటోంది.

Exit mobile version