Site icon NTV Telugu

Pakistan: ‘‘ ప్రతిస్పందించడానికి మాకు 30 సెకన్ల టైమ్ మాత్రమే ఉంది’’.. బ్రహ్మోస్ దాడిపై పాకిస్తాన్..

Pakistan

Pakistan

Pakistan: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ దాడికి ప్రతిస్పందించడానికి తమకు కేవలం 30-45 సెకన్ల టైమ్ మాత్రమే ఉందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహాయకుడు రాణా సనావుల్లా అన్నారు. బ్రహ్మోస్ క్షిపణిలో అణు వార్‌హెడ్ ఉంటుందో లేదో తెలుసుకునేందుకు తక్కువ సమయం ఉన్నట్లు ఆయన అంగీకరించారు.

Read Also: Botsa Satyanarayana: బాబు, పవన్‌ ప్రశ్నిస్తే తాట తీస్తారట..! ఎందుకు నిలదీయకూడదు..?

‘‘నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ స్థావరంపై భారత్ బ్రహ్మోస్ ను ప్రయోగించినప్పుడు, వచ్చే క్షిపణిలో అణు వార్‌హెడ్ ఉండా లేదా అని విశ్లేషించడానికి పాకిస్తాన్ సైన్యానికి 30-45 సెకన్లు మాత్రమే సమయం ఉందని, దీనిపై కేవలం 30 సెకన్లలో ఏదైనా నిర్ణయించడం ప్రమాదకరమైన పరిస్థితి’’ అని సనావుల్లా చెప్పారు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్, పాక్ మిలిటరీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండికి సమీపంలో ఉన్న ప్రధాన స్థావరం. ‘‘వారు అణ్వాయుధాలను ఉపయోగించకపోవడం ద్వారా మంచి చేశారని నేను చెప్పడం లేదు, కానీ అదే సమయంలో ఈ వైపు ఉన్న ప్రజలు దానిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, ఇది ప్రపంచ అణు యుద్ధానికి దారితీసే మొదటి అణ్వాయుధాన్ని ప్రయోగించడానికి దారితీసింది’’ అని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌లోని వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది. రన్‌వేలు, హ్యాంగర్లు, భవనాలను దెబ్బతీసింది. పాకిస్తాన్ చాలా వరకు ఎయిర్‌ఫోర్స్ ఆస్తుల్ని కోల్పోయింది. సర్గోధా, నూర్ ఖాన్ (చక్లాలా), భోలారి, జకోబాబాద్, సుక్కూర్, రహీం యార్ ఖాన్‌లతో సహా మొత్తం 11 ఎయిర్‌బేస్‌లపై భారత్ విరుచుకుపడింది.

Exit mobile version