Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరోసారి సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Imran Khan: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు ‘దౌత్యపరమైన కేబుల్ సాగా – సైఫర్’ కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణలో భాగంగా ఆగస్టు 1వ తేదీన తమ ముందుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో FIA ఇప్పటికే ఇమ్రాన్‌ను రెండు గంటలపాటు విచారించింది. ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది. ఇప్పుడ తాజాగా జారీ సమన్లలో.. ఆగస్టు 1న మధ్యాహ్నంలోపు తమ జాయింట్ ఇన్వెస్టిగేషన్ ముందు సంబంధిత డాక్యుమెంట్లతో హాజరవ్వాలని పేర్కొంది.
Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
కాగా.. గతేడాదిలో ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 2022 మార్చి నెలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఒక లేఖని చూపిస్తూ.. అమెరికా మద్దతుతో తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘అంతర్జాతీయ కుట్ర’ పన్నుతున్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం, ఇమ్రాన్‌పై తారాస్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ఆయన్ను తర్వాతి నెలలో, అంటే 2022 ఏప్రిల్‌లో కార్యాలయం నుంచి తొలగించారు. మరోవైపు.. వారం రోజుల క్రితం ఫెడరల్ ఏజెన్సీ PTI వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీని ఈ కేసులో భాగంగా రెండు గంటలపాటు విచారించింది.
Cemetery Marriage: ఇదేందయ్యా ఇది, ఇది నేన్ చూడలే.. స్మశానంలో పెళ్లా?
ఇదిలావుండగా.. పీటీఐ చీఫ్ సహాయకుడు ఆజం ఖాన్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ సైబర్ కేసు డ్రామా సరికొత్త మలుపు తీసుకుంది. 2022లో అప్పటి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ రాయబారి వాషింగ్టన్కు పంపిన దౌత్యపరమైన సైఫర్‌ను ఉపయోగించారని వెల్లడించారు. గత నెల రోజుల నుంచి కనిపించపోయిన ఆజం.. మేజిస్ట్రేట్ ముందు CrPC 164 కింద తన స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే.. ఆజం స్టేట్మెంట్పై స్పందించేందుకు ఇమ్రాన్ నిరాకరించారు. పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చేంతవరకు, తాను ఈ వ్యవహారంపై ఒక్క మాట కూడా మాట్లాడనని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!