Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bizarre Love Story: ఎవరైనా మన వస్తువుల్ని దొంగలిస్తే మనం ఏం చేస్తాం? అప్పటికప్పుడే ఆ దొంగని పట్టుకొని నాలుగు తగిలించడమో, పోలీసులకు ఫిర్యాదు చేయడమో చేస్తాం. కానీ.. ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా, తన ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడింది. ఈ విడ్డూరం బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఈ ‘దొంగ ప్రేమ’కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తాము ఎలా కలుసుకున్నాం, తమ మధ్య ఎలా ప్రేమ చిగురించిందనే విషయాలను ఆ జంట పంచుకుంది.
Cemetery Marriage: ఇదేందయ్యా ఇది, ఇది నేన్ చూడలే.. స్మశానంలో పెళ్లా?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఆ జంట తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెజిల్‌కి చెందిన ఇమాన్యులా ఒక రోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వీధిలో జాకర్ అనే దొంగ ఆమె చేతిలో ఫోన్ ఉండటాన్ని గమనించాడు. ఇంకేముంది.. దాన్ని దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. ఇమాన్యులా ముందు నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి జాకర్ దూసుకొచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని, అక్కడి నుంచి తారాజువ్వలా పారిపోయాడు. ‘దొంగ దొంగ’ అంటూ ఇమాన్యులా కొంతదూరం వరకు వెంబడించింది కానీ, అతని వాయువేగాన్ని అందుకోలేకపోయింది. దీంతో చేసేదేమీ లేక, ఫోన్ పోతే పోయిందిలే అనుకుని ఇమాన్యులా సైలెంట్ అయిపోయింది. అయితే.. ఫోన్ దొంగలించిన తర్వాత జాకర్ అందులో ఇమాన్యులా ఫోటో చూశాడు. అంతే, దెబ్బకు ఫిదా అయిపోయాడు. ‘ఈ అమ్మాయి ఏంటి ఇంతందంగా ఉంది’ అంటూ ఆమెపై మనసు పారేసుకున్నాడు.
Union Minister Video Call: వీడియో కాల్‌లో పోర్న్.. కేంద్రమంత్రికే బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్
‘ఇంత అందమైన అమ్మాయి ఫోన్‌ని దొంగలించానా?’ అని బాధపడిన జాకర్, తన మనసు మార్చుకొని ఇమాన్యులాని కలిసి, ఆమెకి ఫోన్ తిరిగిచ్చేశాడు. స్వయంగా దొంగే వచ్చి తనకు ఫోన్ తిరిగి ఇవ్వడం.. ఇమాన్యులాకు నచ్చింది. అతని గుణం నచ్చి, స్నేహం చేసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీళ్లు ఒక్కటయ్యారు. తన జీవితంలో అమ్మాయి లేకపోవడం వల్ల దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కున్నానని, కానీ ఫోన్ దొంగలించాక ఇమాన్యులా ఫోటో చూసి ఫిదా అయ్యానని, ఇలాంటి అమ్మాయిని రోజూ చూడాలని అనుకున్నానని జాకర్ తెలిపాడు. అలాగే ఆమె ఫోన్ దొంగలించినందుకు బాధపడ్డానని పేర్కొన్నాడు. ఫోన్ దొంగలించాల్సిన తాను, ఆమె మనసు దోచుకున్నానని చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరు రెండేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్‌ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్‌పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?