NTV Telugu Site icon

Imran Khan: సైఫర్‌ కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌కు పాక్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మరోసారి సమన్లు

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు ‘దౌత్యపరమైన కేబుల్ సాగా – సైఫర్’ కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణలో భాగంగా ఆగస్టు 1వ తేదీన తమ ముందుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో FIA ఇప్పటికే ఇమ్రాన్‌ను రెండు గంటలపాటు విచారించింది. ఆయన స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేసింది. ఇప్పుడ తాజాగా జారీ సమన్లలో.. ఆగస్టు 1న మధ్యాహ్నంలోపు తమ జాయింట్ ఇన్వెస్టిగేషన్ ముందు సంబంధిత డాక్యుమెంట్లతో హాజరవ్వాలని పేర్కొంది.

Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి

కాగా.. గతేడాదిలో ఇమ్రాన్ ఖాన్ తన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో అమెరికా హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 2022 మార్చి నెలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఒక లేఖని చూపిస్తూ.. అమెరికా మద్దతుతో తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ‘అంతర్జాతీయ కుట్ర’ పన్నుతున్నారనడానికి ఇదే సాక్ష్యం అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడం, ఇమ్రాన్‌పై తారాస్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ఆయన్ను తర్వాతి నెలలో, అంటే 2022 ఏప్రిల్‌లో కార్యాలయం నుంచి తొలగించారు. మరోవైపు.. వారం రోజుల క్రితం ఫెడరల్ ఏజెన్సీ PTI వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీని ఈ కేసులో భాగంగా రెండు గంటలపాటు విచారించింది.

Cemetery Marriage: ఇదేందయ్యా ఇది, ఇది నేన్ చూడలే.. స్మశానంలో పెళ్లా?

ఇదిలావుండగా.. పీటీఐ చీఫ్ సహాయకుడు ఆజం ఖాన్ మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంతో ఈ సైబర్ కేసు డ్రామా సరికొత్త మలుపు తీసుకుంది. 2022లో అప్పటి ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ రాయబారి వాషింగ్టన్‌కు పంపిన దౌత్యపరమైన సైఫర్‌ను ఉపయోగించారని వెల్లడించారు. గత నెల రోజుల నుంచి కనిపించపోయిన ఆజం.. మేజిస్ట్రేట్ ముందు CrPC 164 కింద తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. అయితే.. ఆజం స్టేట్‌మెంట్‌పై స్పందించేందుకు ఇమ్రాన్ నిరాకరించారు. పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చేంతవరకు, తాను ఈ వ్యవహారంపై ఒక్క మాట కూడా మాట్లాడనని తెలిపారు.

Show comments