Site icon NTV Telugu

Pakistan: “పార్లమెంట్ నడపడానికి కూడా అప్పు తీసుకుంటున్నాం”.. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని చెప్పిన కొత్త ప్రధాని..

Shahbaz Sharif

Shahbaz Sharif

Pakistan: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని వివరించారు కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్. జాతీయ అసెంబ్లీని నడిపేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి 2030 నాటికి జీ-20 సభ్యత్వాన్ని సాధించేలా చేస్తానని ప్రమాణం చేశారు.

పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి షెహజాబ్ షరీఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రోజు 336 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో 201 ఓట్లను పొంది రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశ 24వ ప్రధానిగా ఆయన ప్రసంగం చేస్తూ పాకిస్తాన్ పరిస్థితులను వివరించారు. మేము విధిని మార్చాలని అనుకుంటున్నామని, ఈ సవాళ్లను ఓడించి పాకిస్తాన్‌ని సరైన స్థితిలోకి తీసుకెళ్తామని, ఈ పని కష్టమైనప్పటికీ అసాధ్యం కాదని అన్నారు. పాకిస్తాన్‌ని అప్పుల ఊబి నుంచి నవాజ్ షరీఫ్, ఆసిఫ్ అలీ జర్దారీ సహకారం తీసుకుంటామన్నారు.

Read Also: BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. వారం రోజుల్లోగా పొత్తులపై క్లారిటీ!

వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రణాళికపై, క్రూరమైన వాడుకలో లేని చట్టాలను నిబంధనలనను రద్దు చేస్తామని అన్నారు. ఎక్స్‌పోర్ట్ జోన్ల నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. 2030 నాటికి జీ-20లో సభ్యత్వం పొందడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దేశం లక్ష కోట్ల రూపాయల కన్నా ఎక్కువ బడ్జెట్ లోటును కలిగి ఉందని, అలాంటి సమయంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు షెహబాజ్ చెప్పుకొచ్చారు. జీ-20 ఆర్థికం అభివృద్ధి చెందిన, చెందుతున్న ఒక గ్రూప్, ఇందులో భారత్ కూడా సభ్యుడిగా ఉంది.

విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు దేశం చెల్లించాల్సిన అప్పులు పేరుకుపోయాయని, ఈ కారణంగా ఇంధన రంగం కుదేలైందని షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) వంటి ప్రభుత్వ యాజమాన్యాలు బిలియన్ల రూపాయల నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముఖ అని, రైతులకు రాయితీ అందిస్తామని చెప్పారు. విత్తన మాఫియాను అంతమొందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Exit mobile version