పెళ్లికి నిరాకరించిందని కూతురిని హత్య చేసిన పాకిస్తాన్ దంపతులకు మంగళవారం ఇటలీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించడంతో సొంత కూతురినే చంపిన ఈ ఘటన 2021లో ఇటలీలో చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పాక్ దంపతులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మృతురాలి తల్లి మాత్రం ఇప్పటికి పరారీలో ఉంది. వివరాలు.. పాకిస్తాన్ చెందని 18 ఏళ్ల సమన్ అబ్బాస్ ఇటలీలోని బోలోగ్నా సమీపంలోని నోవెల్లారాలో నివసిస్తోంది. 2020లో ఆమెకు మేనబావతో తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేసి నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే మరో అబ్బాయిని ప్రేమించిన ఆమె పెళ్లికి నిరాకరించింది.
Also Read: VC Sajjanar: మహాలక్ష్మి- ఫ్రీ బస్సు ఫథకం.. త్వరలో 2050 కొత్త బస్సులు
అయినా తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుండటంతో యువతి ఇటలీలోని సోషల్ వర్కర్స్‌ను సంఘాన్ని ఆశ్రయించడంతో 2020లో వారు ఆమెను ఆశ్రమమంలో ఉంచారు. అయితే ప్రియుడితో కలిసి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆమె పాస్‌పోర్ట్ కోసం 2021లో తన ఇంటికి వెళ్లింది. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు తన బంధువలతో కలిసి ఆమెను చంపేందుకు కుట్ర చేశారు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న ఆమె సీక్రెట్‌గా వెంబడించిన తల్లిదండ్రులు, మేనమామ మరో ముగ్గురు బంధువులు కలిసి ఆమెను హత్య చేసి ఓ పాడుబడ్డ ఇంట్లో ఉంచారు. అనంతరం యువతి తల్లిదండ్రులు పాకిస్తాన్ వెళ్లిపోయారు.
Also Read: PM Modi: ఖలిస్తానీ పన్నూ హత్య కుట్రపై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ..
ఆమె కనిపించకపోవడంతో బాయ్‌ఫ్రెండ్ తల్లిదండ్రులను అనుమానిస్తూ పోలీసు కేసు నమోదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా అప్పటికే వారు పాకిస్తాన్ వెళ్లినట్టు తెలిసింది. ఇంటి చూట్టూ పక్కల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా 2021 ఏప్రిల్ 30న ఆమెను మరణాయుధాలతో కుటుంబ సభ్యులు ఆమె వెంబడించినట్టు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులే ఆమెను హత్య చేసినట్టు నిర్ధారించిన పోలీసులు పాకిస్తాన్ వెళ్లిన వారు కనిపించలేదు. చివరికి ఈ ఏడాది ఆగస్టులో వారిని ఇటలీ రప్పించిన పోలీసులు స్పెయిన్‌లో అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తామే హత్య చేసినట్టు యువతి తండ్రి, బంధువులు అంగీకరించారు. దీంతో ఈ కేసుపై మంగళవారం విచారణ చేపట్టిన ఇటలీ కోర్టు యువతి మేనమామకు 14 నెలల జైలు శిక్ష విధించింది. ఇక ఆమె తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించింది. కానీ యువతి తల్లి నాజియా షాహీన్ ఇప్పటికీ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.
