Site icon NTV Telugu

Pakistan: ఛీ ఇదేం పని రా.. మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ ప్రతినిధి..

Pak Army

Pak Army

Pakistan: నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్‌లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటుతున్నట్లు చూపించే వీడియో వెలువడిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Pinaka Mk4 Missile: ఇక ఇస్లామాబాద్ వణకాల్సిందే – కరాచీ దద్దరిల్లాల్సిందే.. భారత ఆయుధామా మజకా

సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో, జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై వచ్చిన ఆరోపణల గురించి, జర్నలిస్ట్ అబ్సా కోమల్ అహ్మద్ షరీఫ్ చౌదరిపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ జాతీయ భద్రతకు ముప్పు అని, దేశ వ్యతిరేకి అని, ఢిల్లీకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ఆర్మీ ప్రతినిధి ఆరోపించారు. ఈ సమయంలోనే అతను కోమల్ వైపు చూస్తూ, నవ్వుతూ ‘‘కన్నుకొట్టాడు’’.

ఈ ఘటన వీడియోలో రికార్డ్ కావడం, ఆ తర్వాత వైరల్ కావడంతో అహ్మద్ షరీఫ్ చౌదరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి పనులు చేయవచ్చా..? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయం నుంచి తరుచుగా, పాక్ సైన్యం గురించి గొప్పలు చెబుతూ చౌదరి ఫేమస్ అయ్యారు. ఇతను ఒసామా బిన్ లాడెన్ సహాయకుడిగా ఉన్న సుల్తాన్ బహీరుద్దిన్ మహమూద్ కుమారుడు.

Exit mobile version